జనాభాకు అనుగుణంగా పశు సంపద ఉండాలి

 


మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జూలై 06 (globelmedianews.com
జనాభాకు అనుగుణంగా పశు సంపద బాగా ఉండేందుకు వాటికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వనపర్తి మండలం చిమనగుంతపల్లీ లో ఉచిత రోగ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశు సంపద ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, జనాభాతో పాటు అన్ని సంపదలు అనుగుణంగా పెరగాలని ఆయన అన్నారు. వ్యవసాయం. 

జనాభాకు అనుగుణంగా పశు సంపద ఉండాలి

ధాన్యం దిగుబడి. పశువులు. పాడి గేదలు. గొర్రెలు. మేకల సంతతి బాగా పెరగాలని వీటి మూలంగానే పెరుగుతున్న జనాభాకు పాలు, మాంసం, ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని అన్నారు. ఆరోగ్యవంతమైన జీవాల నుండి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు అందాల నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మనిషి తన పిల్లలను ఏ విధంగా సం రక్షించుకుంటాడో అలాగే మూగ జీవులను సంరక్షించుకుంటే మన మనుగడకు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. గతంలో, పశువులు, గొర్రెల పెంపకానికి నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత ఉండేద నీ ఈనాడు కృష్ణా జలాలు రాకతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన వ్యక్తపరిచారు. ప్రజలు పాడి గేదెల కు గొర్రెల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనిఆయన సూచించారు.

No comments:
Write comments