మారుతోన్న సర్కారీ దవాఖానాలు

 

ఖమ్మం, జూలై 9,(globelmedianews.com)
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ....అంటూ ఒకప్పుడు ఒక ఊపు ఊపిన పాట.. నాటి సర్కారు దవాఖానాల పరిస్తితి చెప్పకనే తెలియచెప్పేది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటే నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్.. అపరిశుభ్రతకు నిలువెత్తు నిదర్శనం. ప్రాణం పోతున్న పట్టించుకోరనే అపవాదు ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వాసుపత్రులను వైద్యం చెయ్యడంలోనే కాదు సౌకర్యాల కల్పనలోనూ కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో తయారు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని పేదలకు చేరువ చేస్తున్నారు.. నేను రాను బిడ్డో స‌ర్కారు దవాఖ‌ను అనే నోటి నుంచే.. గవర్నమెంటు ఆసుపత్రి అంటే అసలు నమ్మలేనంత స్థాయిలో సౌకర్యాలు కల్పించారు.. మౌళిక వసతులు , ట్రీట్మెంట్ విధానం లో కూడా సమూల మార్పులు తీసుకొచ్చారు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకే త‌ల‌మానికంగా మారిన ప్ర‌భుత్వాసుప‌త్రిలో 400 ప‌డ‌క‌లున్నాయి.. అందులో 250 ప‌డ‌క‌లు ప్ర‌త్యేకంగా మాతా శిశు కేంద్రానికి కేటాయించారు.. ఒక్క ఖ‌మ్మం జిల్లా నుంచే కాకుండా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబాద్, సూర్య‌పేట జిల్లాల నుంచి రోగులు చికిత్స‌కోసం ఖమ్మం ప్ర‌భుత్వాసుప‌త్రికి వ‌స్తుంటారు.. ప‌క్క‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఖ‌మ్మం ఆసుప‌త్రి పెద్ద దిక్కుగా ఉంది.. నిత్యం 60 మంది డాక్ట‌ర్లు మూడు షిఫ్ట్ ల్లో 24×7 వైద్య సేవ‌లందిస్తుంటారు. ఇందులో 50 మందికి పైగా డాక్ట‌ర‌లు పోస్టు గ్రాడ్యుషన్ పూర్తి చేసిన నిష్నాతులు. కొత్త‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన 2500 డాక్ట‌ర్ల పోస్టుల నియామ‌కంలో ఖ‌మ్మం ప్ర‌ధాన‌సుప‌త్రికి 40 నుంచి 50 మంది డాక్ట‌ర్లు కేటాయిస్తార‌ని తెలుస్తోంది. వారంతా డ్యూటీలో జాయిన్ అయితే ఖ‌మ్మం ఆసుప‌త్రిలో వైద్యుల అదుబాటు, వైద్య సేవ‌ల విస్తృతి పెరుగుతుంది. న‌ర్సింగ్, క్లినింగ్, అసిస్టెంట్ స్టాఫ్ విష‌యంలో కూడా ఖ‌మ్మం ఆసుప‌త్రిలో స‌రిప‌డినంత మంది ప‌ని చేస్తున్నారు. వంద మంది నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారు. మ‌రో 160 శానిటేష‌న్ వ‌ర్క్స్ చేస్తూ ఆసుప‌త్రిని ఎల్ల‌ప్పుడు ప‌రిశుభ్రంగా ఉంచుతున్నారు.
మారుతోన్న సర్కారీ దవాఖానాలు

ఖ‌మ్మం ప్ర‌ధానాసుత్రిలో ఒక‌ప్పుడు ఐదు నుంచి ఆరు వంద‌ల మంది మాత్ర‌మే ఓపి ఉండేది... పేదలు నిరుపేద‌లు, ఆర్థికంగా స్థోమ‌త లేని వారు మాత్ర‌మే ఇన్ పేషంట్స్ గా ఉండి వైద్యం చేయించుకునే వారు.. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, పాత బిల్డింగ్ లో రోగులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేది. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఆసుప‌త్రి మెయింటెనెన్స్ లో స‌మూళ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం ఖ‌మ్మం పేద‌ల‌కు మంచి వైద్యం అందేలా చేసింది.. క్ర‌మంగా ఓపి రోగుల సంఖ్య‌ల పెరుగుతూ వ‌చ్చింది. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల్లో ప్ర‌తి రోజు ప‌న్నెండు(1200) వంద‌ల మంది వ‌ర‌కు రోగులు ఆసుప‌త్రిలో వైద్యం పొందేస్థాయికి చేరింది. పోయినాడేది నుంచి అత్యాదునిక డ‌యాల‌సిస్ సెంట‌ర్, ఎమ‌ర్జెన్సీ స‌ర్విస్ లు, డయాస్టిక్ ప‌రికాల‌ను స‌మ‌కూర్చుకోవ‌డంతో.. ఆసుప‌త్రి ఓపి రోజూ 1500 నుంచి 1600 వంద‌ల‌కు చేరింది. జ‌న‌ర‌ల్ వ్యాదుల‌తో పాటు అత్య‌వ‌స‌ర చికిత్స‌లు అందించే ఐసీయూ ( ఇంటెన్సివ్ కేర్ యూనిట్ )ను కూడా ఖ‌మ్మ ప్ర‌భుత్వాసుప‌త్రి క‌లిగి ఉన్న‌ది. రాష్ట్రంలో అత్యదింకంగా డ‌యాల‌సిస్ సేవ‌లు కూడా ఇక్క‌డ అందిస్తున్నారు. 16 ప‌డ‌క‌లు క‌లిగిన డ‌యాలసిస్ సెంట‌ర్ 24 గంట‌ల పాలు ప‌ని చేస్తుంది. ప్ర‌తి రోజు 50 నుంచి 60 మందికి నెల‌కు స‌రాస‌రిన 1500 వంద‌ల మందికి పైగా డ‌యాల‌సిస్ సేవ‌ల‌ను పొందుతున్నారు.. టాటా ట్ర‌స్తు వారి స‌హ‌కారంతో ఖ‌మ్మం గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రిలో నెల‌కొల్ప‌బోతున్న క్యాన్స‌ర్ యూనిట్ కూడా అత్య‌ధునిక హంగులు, మోడ్ర‌స్ చికిత్స విధానంలో రూపుదిద్దుకుంటోంది. న్యూరాల‌జీ, యూరాల‌జీ, కార్డియాజ‌లి విభాగాల‌ను కూడా స‌మ‌కూర్చుకోవ‌డం ద్వారా ఖ‌మ్మం ఆసుప‌త్రి వైద్య సేవ‌లు మ‌రింత విస్తృత‌మ‌య్యాయని చెప్ప‌వ‌చ్చు.. ఖ‌మ్మంకు కేటాయించి ట్రామా కేర్ సెంట‌ర్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. 15 కోట్ల రూపాయ‌ల‌తో 100 పడ‌క‌ల ప్ర‌త్యేక బ్లాక్ మ‌రో నెల‌లో అందుబాటులోకి వ‌స్తుంది. అప్పుడు 24 గంట‌ల పాటు అన్ని అత్య‌వ‌స‌ర సేవ‌లు పేద‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టు అవుతుంది.. ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన 10 పడ‌క‌ల ఐసీయూ యూనిట్ అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతూ.. ప్ర‌జ‌ల విలువైన ప్రాణాల‌కు కాపాడుతోంది. రెండు వెంటి లేట‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. సొంత టెస్టింగ్ ల్యాబ్స్, బ్లడ్ బ్యాంక్, ఫార్మ‌సీ సెంట‌ర్ ఉండ‌టం కూడా పేద‌ల‌కు లాభం చేకూర్చుతుంది. ర‌క్త ప‌రీక్ష‌లు, ఎక్స్ రే లు, సీటీ స్కాన్లు, స‌హా అన్ని టెస్టులు ప్ర‌భుత్వాసుప‌త్రిలో అందుబాటులో ఉన్నాయి.. త్వర‌లోనే ఎంఆర్ఐ స్కాన్ కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన తెలంగాణ డ‌యాస్టిక్ సెంట‌ర్ కూడా ఏర్పాటు చేస్తే.. ఇక ఎలాంటి ప‌రీక్ష‌లైన ప్ర‌జ‌ల‌కు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వ‌స్తాయి. ప్ర‌త్యేక రేడియాల‌జీ డిపార్ట్ మెంట్ నిర్వ‌హ‌నలో వైద్య ప‌రీక్ష‌ల సెంట‌ర్ నెల‌కొల్ప‌బోతున్నారు.. ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటుకు స‌రిప‌డిన‌న్ని సేవ‌ల‌ను స‌మ‌కూర్చుకునేందుకు ఖ‌మ్మం వైద్యులు అన్ని ర‌కాలుగా క‌ష్ట‌ప‌డుతున్నారు.. 
వాయిస్ 
ఖ‌మ్మం జిల్లా ప్ర‌ధాన‌ఆసుప‌త్రిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన మాతా శిశు కేంద్రం విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు నాందిప‌లికింది. గ‌తంలో జిల్లా ప్ర‌భుత్వాసుత్రి ( 350) మూడు వంద‌ల యాబై మంది మాత్ర‌మే కాన్పులు చేయించుకునే వారు. కానీ కొత్త‌గా ఏర్పాటు చేసిన 250 ప‌డ‌క‌ల మాతాశిశు కేంద్రం ఏర్పాటు అయ్యాక ప్ర‌స‌వాల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్ కిట్ త‌ర్వాత నెల వారి ప్ర‌స‌వాల సంఖ్య అమాంతం రెండు రెట్లు పెరిగింది. ఇపుడు నెల‌కు 750 నుంచి 800 వంద‌ల కాన్పులు చేస్తున్నారు ప్ర‌భుత్వ వైద్యులు.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా... సిజేరియ‌న్ చేయ్య‌డం లేదు.. ప్ర‌భుత్వం ఆసుప‌త్రిలో సాధార‌ణ ప్ర‌సవాల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.. దీంతో గ‌త ఏడాది జూన్ నుంచి ఈ యేడాది జూన్ నెల ముగింపు వ‌ర‌కు దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ప్ర‌భుత్వా ఆసుప‌త్రి మాతా శిశు కేంద్రంలో ప్ర‌స‌వాలు చేయించుక‌న్నారు.. వారంద‌రికీ కేసీఆర్ కిట్లు అంద జేశారు.. శిశుమ‌ర‌ణాల రేటు కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. గ‌తంలో 30 శాతం మంది చిన్నారులు.. పురిటిలోనే ప్రాణాలు కోల్పోయే ప‌రిస్థితులు ఉండేవి కానీ... అత్యాధునిక వ‌స‌తులు, 24 గంట‌ల పాటు వైద్యులు అందుబాటులో ఉండ‌టంతో.. శిశుమర‌ణాల రేటు 10 నుంచి 14 శాతానికి త‌గ్గిపోయింది. సాధార‌ణ ప్ర‌స‌వాలు పెర‌గ‌డం కూడా వైద్య సేవల మెరుగువ‌ల్లే సాద్య‌మైంది. గ‌తంలో ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళితే.. అవ‌స‌రం ఉన్నా లేకున్నా.. ఆప‌రేష‌న్లు చేసే వారు. ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు.. ఇద్ద‌రు ప్ర‌సూతి వైద్య నిఫులు ప‌గ‌లూ రాత్రి 24 గంట‌లు అందుబాటులో ఉంటున్నారు.. మొబైల్ ఇంక్యూబేట‌ర్ల వ‌ల్ల శిశుమ‌ర‌ణాల రేటు బాగా కంట్రోల్ అయింది. అలార‌మ్ సిస్టం వ‌ల‌న అత్య‌వ‌స‌ర కేసుల్లో డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది అలెర్టుగా ఉంటూ వైద్య సేవ‌లు అందించ‌డం ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రి మ‌రో ప్ర‌త్యేక‌త‌.
ఖ‌మ్మం జిల్లా ప్రధానాసుప‌త్రికి పాత బిల్డింగును ఓ అలంకారంగా ఉంటుంది. కానీ నెర్ర‌లుచాచి, రంగులు వెసిపోయి ఉండేది. కాయకల్ప ద్వారా లభించిన నిధులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా కలెక్టర్ నిధులు స‌మ‌కూర్చ‌డంతో.. పాత బిల్డింగ్ ను కార్పోరేట్ త‌ర‌హాలో అబివృద్ది చేస్తున్నారు. ఎక్క‌డా అప‌రిశుభ్ర‌త‌కు తావు లేకుండా చూస్తున్నారు.. సిబ్బంది కొర‌త తీర్చారు..కావాల్సిన‌న్ని నిధులు అందుబాటులో ఉండ‌టంతో.. నిత్యం ప‌రిశుభ్ర‌త‌ను కొన‌సాగిస్తున్నారు.. డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆయాలు, వార్డు బాయిలు సంఖ్య గ‌తంతో పోల్చితే గ‌ణ‌నీయంగా పెరిగింది. రోగుల తాకిడి పెరిగిన నేప‌థ్యంలో.. సిబ్బంధి సంఖ్య‌ను కూడా పెంచారు.. అన్ని బ్లాక్లు, డిపార్టుమెంట్ల‌లో మొత్తం కంప్యూట‌రైజ్ వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్పారు.. ఇటు కాయ‌క‌ల్ప 50 ల‌క్ష‌లు, అలు కేంద్రం నుంచి వ‌చ్చే కోటి ఇవ‌రై ల‌క్ష‌ల‌తో ఆసుప‌త్రిని మరింత‌ అభివృద్ది చేస్తామంటున్నారు.హ‌రిత హారంలో కూడా నెంబ‌ర్ వన్ స్థానంలో ఉన్న ఖ‌మ్మం గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రిలో ప‌చ్చ‌ద‌నానికి కొద‌వ లేదు. రోగులతో వ‌చ్చే బంధువులు సేద‌తీరేందుకు త‌గు ఏర్పాట్లు చేశారు.. పిల్ల‌లు ఆడ‌కునేందుకు చిల్డ్ర‌న్ పార్కును , ఆట వ‌స్తువుల‌ను స‌మ‌కూర్చారు.. క్యాంటిన్ తో పాటు రోగుల బంధువుల‌కు టాయిలెంట్లు, షెల్ట‌ర్ గ‌దుల‌ను , లాక‌ర్ రూమ్ నుల కూడా క‌ల్పిస్తున్నారు.ప్రభుత్వాసుపత్రులలో సరైన వైద్యం లభించకపోవటంతో ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనితో కార్పొరేట్ ఆసుపత్రులలో వసతులు, ఆధునిక సౌకర్యాలు, ఆధునిక యంత్ర పరికరాలు, ఫారెన్ డాక్టర్లు, అంటూ... రకరకాల పరీక్షలు అంటూ... ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. ఒక మధ్యతరగతి మానవుడు కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే వారి మిగతా శేషజీవితమంతా చికిత్స నిమిత్తం చేసిన అప్పులు తీర్చటానికి అయిపోతుంది. అదే ప్రభుత్వాసుపత్రులలో ఇదే కార్పొరేట్ స్థాయి వసతి సౌకర్యాలు, నిపుణులైన డాక్టర్లు, డయాగ్నస్టిక్ సెంటర్, ఆధునిక యంత్ర పరికరాలు... ఇలా సర్వ సౌకర్యాలు కల్పించినట్లయితే ఇటు సాధారణ ప్రజానీకం మంచి వైద్యుని పొందగలుగుతారు.

No comments:
Write comments