మిషన్ భగీరథ తో రోడ్లన్నీ బురదమయం

 


వనపర్తి జూలై 2 golbelmedianews.com
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం లోని ఏదుట్ల గ్రామంలో మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ బురదమయంగా మారాయని జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ రాజ వర్ధన్ రెడ్డి ఆరోపించారు. అసలే వర్షాకాలం ఆపై మిషన్ భగీరథ పైపుల వల్ల రోడ్లన్నీ బురదమయంగా మారాయని ఆయన విమర్శించారు. గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైపుల నిర్మాణం కోసం గుంతలు తీయడం, పైపులు బయటికి ఉండడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్లు బురదమయం కాకుండా చూడాలని ఆయన కోరారు.
మిషన్ భగీరథ తో రోడ్లన్నీ బురదమయం

No comments:
Write comments