యదేఛ్చగా కల్తీ నూనెలు

 


మంటకలుస్తున్న ప్రజారోగ్యం
నిజామాబాద్, జూలై 5, (globelmedianews.com
కల్తీ నూనెలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. నిరంతరం పర్యవేక్షణతో వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో కల్తీ నూనె, నెయ్యి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి పట్టణం, జుక్కల్, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారితో పా టు జిల్లాలోని పలు ప్రాంతాలు ఏకంగా కల్తీ నూ నెకు అడ్డాగా మారుతోంది.సెకండ్ కేటగిరి దందాకు కొన్ని ప్రాంతాలు పెట్టింది పేరుగా మారుతోంది. ఇ క్కడి నుంచే కల్తీ నూనె టిన్‌ల రూపంలో సరఫరా అవుతోంది. హోటళ్లు, రోడ్డు పక్కన పెట్టే చిరుతిళ్ల బండ్లు, కొన్ని ఫంక్షన్ హాళ్లలో దీనిని చేరవేస్తున్నారు. ఈ నూనెతో చేసిన తినుబండారాలు తింటున్న అ మాయకులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ దం దాపై ఇటు పోలీసులు, అటు ఆహార తనిఖీ అధికారుల పర్యవేక్షణ కరవవ్వడంతో జిల్లాలో కల్తీ నూనె, నెయ్యి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సమాచారం ఇచ్చినా కనీసం దాడులు సైతం చేయకపోవడంతో ఆ రెండు శాఖల అధికారుల తీరుపై దొందూ దొందే అన్నట్లు ప్రజలంతా చర్చించుకుంటున్నారు. నిర్ధిష్టంగా కల్తీ అని పసిగట్టలేనంతగా పరిస్థితి మారుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

యదేఛ్చగా కల్తీ నూనెలు

కల్తీ నూనెలను భిన్న రీతిలో తయారు చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. జంతువుల ఆ స్తి పంజరాల నుంచి తయారు చేసిన నూనెలు, పత్తి గింజల నుంచి సేకరించిన నూనెలను చౌకగా సేకరించి వాటిని వంట నూనెల్లో కలుపుతున్నారు. తళతళ మెరిసే నూనెను చూసి నివ్వెర పోతున్న జనం ఇదే అసలు అనుకుని కొనుగోలు చేస్తుండడం గమనార్హం. వేరుశనగ నూనె తక్కువ పరిమాణంలో, ప త్తి గింజల నూనె, ఇతర కల్తీ నూనెను ఎక్కువ పరిమాణంలో మిక్స్ చేస్తున్నారు. తయారీ అనంతరం దీనిని మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నారు. అసలు నూనెకు రెండు, మూడింతలు కల్తీ నూనె కలిపేసి సొ మ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా తయారీతో పా టు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్రమంగా కల్తీ నూనె వచ్చి పడుతుండడంతో వినియోగదారులు ఏ ది మంచో, ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారు. ధరల విషయంలో ఎలాంటి రాజీ పడని అక్రమార్కులు లీటర్ వంట నూనెను రూ.80కి తక్కువకు అమ్మడం లేదు. హైదరాబాద్, మహారాష్ట్రల నుంచి తరలిస్తున్నదో నెంబర్ నూనెలతో వంట నూనెలను విక్రయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారం అంతా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని పేరు మోసిన గల్లీల్లోనే సాగుతున్న పట్టించుకునే వారే క రువయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలే లక్ష్యంగా వీటి ని లీటర్ల కొద్దీ విక్రయిస్తుండగా హోల్ సేల్ పేరుతో వారిని సులువుగా ఆకర్షిస్తున్నారు. బ్రాండెడ్ వంట నూనె మార్కెట్లో రూ.80కి పైగా పలుకు తోంది. కొన్ని ప్యాకెట్లు రూ.86 వరకు పలుకుతుండటంతో సామాన్యులు మాత్రం ధర తక్కువగా ఉండే నూనెల వైపు ఆసక్తి చూపుతున్నారు.. ధర ఎంత... బ్యాచ్ నెంబర్ ఎం త... ప్యాకింగ్ చేసిన తేదీ, గడువు తేదీ తదితర వివరాలు స్పష్టంగా కనిపించేలా ప్యాకింగ్ ఉండాలి. టి న్ డబ్బాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కానీ, కల్తీ నూనె సరఫరా సమయంలో ఆ సరకును పరిశీలిస్తే ఇవేవీ కనిపించవు. గడువు ముగిసిన తేదీల నూ నెలను కూడా మంచి నూనెలో కలిపి మార్కెట్ కు తరలిస్తున్నారు. మంచి నూనెను 25 - 40 శాతం తీసుకుని మిగతా కల్తీ నూనెను కలిపి దందా సాగిస్తున్నారు. కానీ, ధరల విషయంలో మాత్రం అసలు వాటితో పోటీ పడుతున్నాయి. చిరు , బడా వ్యాపారులు కూడా కల్తీ నూనె వైపునకే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో నూనె మాదిరిగానే నెయ్యిని కల్తీ చేసేస్తున్నారు. దీనికి రూ.70 నుంచి రూ.85కు లభించే బ్రాండ్ నెయ్యిని తీసుకుంటున్నారు. ఇది కూడా కల్తీ పేరుతో ఇతరులు తయారు చేసిందే. రూ.60 నుంచి రూ.65 కు మధ్య మార్కెట్లో లభించే ఈ నెయ్యి తీసుకుని దానికి మూడింతలు కల్తీ నెయ్యి కలిపి విక్రయిస్తున్నారు. నెయ్యి కిలో రూ.450 నుంచి రూ.500 వరకు ఉండగా, కల్తీ నెయ్యి రూ.400కు అటూ, ఇటుగా లభిస్తోంది. ఈ విషయంపై వివరణ కోసం ఆహార కల్తీ నియంత్రణ అధికారి నాగరాజుని సంప్రదించగా స్పందించేందకు నిరాకరించారు. పరిస్థితిని అదుపులో పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

No comments:
Write comments