మధ్య తరగతికి ఊరట

 


న్యూఢిల్లీ, జూలై 5, (globelmedianews.com)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025 నాటికి 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ వడివడిగా అడుగులేస్తోందని ఆమె తెలిపారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించం కోసం.. వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పనకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మిస్తామన్నారు. 

మధ్య తరగతికి ఊరట

విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారికి ఆదాయపన్ను ఉండదని స్పష్టం చేశారు. రూ.45 లక్షల్లోపు గృహ రుణాలపై వడ్డీ రాయితీని రూ.3.5 లక్షలకు పెంచారు. బంగారం, పెట్రోల్, డీజిల్‌లపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పటి వరకు బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రులు సూట్‌కేసులో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు.. కానీ నిర్మలా సీతారామన్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. రాజముద్ర ఉన్న ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొని ఆర్థిక మంత్రి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అంతకు ముందే ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి బడ్జెట్‌ కాపీని అందజేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఆమె బడ్జెట్‌‌‌ను ప్రవేశపెట్టారు. 

No comments:
Write comments