చండ్రగొండలో రైతుల నిరసన

 

భద్రాద్రి కొత్తగూడెం జూలై 10 (globelmedianews.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామచర్ల రైతులు తమ  భూములు తమకు ఇవ్వాలని రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు.  20 సంవత్సరాల క్రితం  ప్రభుత్వం  పట్టాలు ఇచ్చింది.  తెలంగాణ ప్రభుత్వం మాకు పట్టా పాసు పుస్తకాలు రైతుబంధు పథకాలు ఇవ్వడం లేదని  వారు ఆరోపించారు.  
చండ్రగొండలో రైతుల నిరసన

130 ఎకరాల  భూములు ఆదివాసి  నాయక భూములను ఇవ్వకపోవడం నెలరోజులుగా చంద్రుగొండ  తాసిల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేస్తున్నా   పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేసారు.  బుధవారం నాడు  మహిళలతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి న్యాయం చేయాలని నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. గతంలో పట్టాలిచ్చి ఇప్పుడు సాగు చేసుకొనివ్వడంలేదని తమ పిల్లలతో రోడ్డున పడ్డామని పంట సాగు  చేసుకుంటే అడ్డుకున్నారు అని రైతులు ఆవేదనచెందుతున్నారు.

No comments:
Write comments