సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..స్పీకర్‌ రమేశ్ కుమార్‌

 

బెంగళూరు జూలై 17 (globelmedianews.com
సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక స్పీకర్‌ రమేశ్ కుమార్‌ స్వాగతించారు. రాజీనామాలపై ఆలస్యం చేయబోనని, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. కాగా సుప్రీం తీర్పు వచ్చినప్పటికీ కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని న్యాయస్థానం చెప్పడం కుమారస్వామి ప్రభుత్వానికి చేదు వార్తే. 
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..స్పీకర్‌ రమేశ్ కుమార్‌

ఎందుకంటే గురువారం ఉదయం అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ 15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 105. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి 107. అటు జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంఖ్యా బలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమార నెగ్గే అవకాశాలు కన్పించట్లేదు. సుప్రీం తీర్పుపై భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయం. ఎమ్మెల్యేల నైతిక విజయం. రెబల్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం విప్‌ జారీ చేయలేదు. దాంతో విశ్వాసపరీక్షలో కుమారస్వామి నెగ్గలేదు. ఇక ప్రభుత్వం కూలడం ఖాయం. రేపే ఆఖరితేదీ’ అని యడ్యూరప్ప అన్నారు.

No comments:
Write comments