ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

 


జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి 
పెద్దపల్లి జూలై 08 (globelmedianews.com):
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని  జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి సంబంధిత  అధికారులను 8ఆదేశించారు.    కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి (75) వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.  

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ది కొరకు అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్క అర్హుడుకి పథకాల ఫలితాలు అందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో హరితహారం  కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు తమ లక్ష్యాలను చేరుకోవాలని, అధికారులు ఉద్యోగులు  హరితహారం కార్యక్రమంలో పాల్గోని పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని, మొక్కలను నాటడానికి  సంరక్షించడానికి విద్యార్థులు,  ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.   ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని ఆదేశించారు.  

No comments:
Write comments