సానా అరెస్ట్ తో బాబుకు చెక్

 

న్యూఢిల్లీ, జూలై 29, (globelmedianews.com)
ఒకప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్… కోట్లకు పడగలెత్తాడు. లాబీయింగ్ చేయడంలో దిట్ట. ఫైళ్లను ఆపడంలోనూ, వేగంగా కదిలించడంలోనూ సిద్ధహస్తుడు. ఆయనే సానా సతీష్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి దగ్గరగా ఉండే వ్యక్తి. ఇప్పుడు సానా సతీష్ అరెస్ట్ తో చంద్రబాబునాయుడుకు ఢిల్లీలో కత్తెర పడినట్లయింది. లాబీయింగ్ లు నిలచిపోనున్నాయి. సానా సతీష్ విచారణలో తెలుగుదేశం నేతల పేర్లు ఎవరెవరివి బయటకు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.సానా సతీష్ విద్యుత్తు శాఖలో ఇంజినీర్ గా జీవితాన్ని ప్రారంభించి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ఆయనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో అధికారులను మేనేజ్ చేయడంలో సానా సతీష్ అందెవేసిన చేయి. 
సానా అరెస్ట్ తో బాబుకు చెక్

అయితే ఇదే ఆయనకు చిక్కుల్లో నెట్టింది. మటన్ వ్యాపారి మొయిన్ ఖురేషీకి కేసులో సీబీఐ అధికారులకు లంచం ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యాడు.గతంలో సీబీఐ అధికారిగా ఉన్న అలోక్ వర్మకు సానా సతీష్ చెంచాగా వ్యవహరించాడంటారు. ఈ సంగతిని గమనించి మోదీ సర్కార్ అలోక్ వర్మను తప్పించింది. మోదీ ప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో ఉన్న బొల్లిసేని శ్రీనివాస్ గాంధీ వంటి చంద్రబాబు బృందాలను మోదీ ముందుగానే తప్పించారు. సీబీఐ, ఈడీలో ఉన్న తన సన్నిహితుల సాయంతో ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడుకు, ఆయన పార్టీ నేతలకు సత్వరం దాడులు సమాచారం అందేదన్న ప్రచారం ఉంది.ఇప్పుడు సానా సతీష్ అరెస్ట్ తో చంద్రబాబునాయుడును అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన వ్యవస్థల్లో చంద్బరాబునాయుడుకు అనుకూలంగా ఉన్న వారిని మార్చివేయడం ఇందులో భాగమేనన్నది ఢిల్లీ వర్గాలనుంచి అందుతున్న సమాచారం. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపైనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధారపడక తప్పదంటున్నారు. వారికి కూడా కమలం కళ్లెం వేస్తుందని చెబుతున్నారు.

No comments:
Write comments