సిటీ ట్రాఫిక్ లో డిజిటల్ లైటింగ్

 


హైద్రాబాద్, జూలై 3, (globelmedianews.com)
టెక్నాలజీని వినియోగించుకోవటంతో హైదరాబాద్ ట్రాఫిక్ అధికారులు ముందుంటారని మరోసారి రుజువైంది. ట్రాఫిక్ లను నియంత్రించేందుకు కొత్త పద్ధతులను అమలు చేస్తు..సరికొత్త   స్మార్ట్ సిగ్నల్ ఏర్పాటయ్యాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పోల్స్ పై ఉన్న లైట్లతోనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పోల్స్ వైపు చూడకుండానే రోడ్ పైనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ టైమ్ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాప్‌లైన్‌పై లైట్లు కనబడేలా డిజిటల్, అనలాగ్ సిగ్నళ్లను ఏర్పాటుచేస్తున్నారు. 

 సిటీ ట్రాఫిక్ లో డిజిటల్ లైటింగ్

ఈ తరహా సిగ్నల్స్ ను బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చౌరస్తా  వద్ద ప్రారంభించారు. స్టాప్ లైన్ సమీపానికి రాకుండానే దూరం నుంచి వచ్చేవారికి కూడా ఈ సిగ్నల్స్ కనిపించేలా డిజిటల్ లైటింగ్‌ను రోడ్డుకు అడ్డంగా పడేలా ఏర్పాటుచేశారు. రాత్రి సమయంలో సిగ్నల్స్  కనిపించక వాహనదారులు స్పీడ్ గా వచ్చి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలో లేకపోలేదు. ఇటువంటి ప్రమాదాలు జరగుకుండా ఉండేందుకు వాటిని నియంత్రించేందుకు ఈ డిజిటల్ లైంటి ఉపయోగపడుతుంది. కేబీఆర్ పార్కు సిగ్నల్ వద్ద  ఈ ఏర్పాటుకు మంచి రెస్పాన్స్ వస్తే నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటి సిగ్నల్ వ్యవస్థను  ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.  కాగా రోడ్డుకు అడ్డంగా లైటింగ్‌తో స్టాప్‌లైన్ దాటి వాహనాలు నిలిపితే సీసీ కెమెరా ద్వారా ఫోటోలు తీసి చలానా విధించే అవకాశాలు ఉన్నాయి. సో..బీ కేర్ ఫుల్. గీత దాటితే ఫైన్ తప్పదు. 

No comments:
Write comments