కర్నూలు బ్రదర్స్ కు ట్విస్ట్ లు

 


కర్నూలు, జూలై 5, (globelmedianews.com)
ఓటరు దేవుళ్లు వరమిచ్చినా… వై.ఎస్. జగన్ వారికి వరమివ్వలేదు. ఇటీవల జరిగిన ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ కు కూడా ప్రతిష్టాత్మకమే. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ గెలుపు కోసం ఆయన తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేశారు. ఇక సీమ జిల్లాలోని కర్నూలును తీసుకుంటే ఇక్కడ పార్టీ కంటే నేతల వ్యక్తిగత ఇమేజ్ పనిచేస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే పేరున్న నేతలకే జగన్ టిక్కెట్లు పంపిణీ చేశారు.కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ విజయఢంకా మోగించింది. రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పండగ చేసుకున్నారు. వై.ఎస్ జగన్ తమను గుర్తు పెట్టుకుంటారని నేతలందరూ గట్టిగా నమ్మారు. కర్నూలు జిల్లాలో అన్నదమ్ములు పోటీ చేశారు. 

కర్నూలు బ్రదర్స్ కు ట్విస్ట్ లు

పేరున్న కుటుంబాలు కూడా బరిలోకి దిగాయి. అందరూ గెలిచిపోయారు.కర్నూలు జిల్లాలో కాటసాని కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్కేగా విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన పాణ్యం నియోజకవర్గం నుంచి 44 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఆయన సోదరుడు కాటసాని రామిరెడ్డి బనగానపల్లి నుంచి గెలుపొందారు. ఖచ్చితంగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ దక్కలేదు. అలాగే ఈ ఎన్నికల్లో గెలిచిన రాంపురం రెడ్డి సోదరులు. మంత్రాలయం నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్ రెడ్డి, గుంతకల్లు నుంచి వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. వీరి ముగ్గురు ఒకతల్లి కడుపున పుట్టిన వారే. వీరు కూడా తమ ముగ్గురి సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. వీరిలో బాలనాగిరెడ్డి మూడుసార్లు, సాయిప్రసాద్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిలో ఏ ఒక్కరి మీద వై.ఎస్.జగన్ జాలి చూపలేదు.ఇక శిల్పా కుటుంబాన్ని తీసుకుంటే… ఈ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం, శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. శిల్పా చక్రపాణిరెడ్డి దాదాపు ఐదేళ్ల కు పైగానే ఉన్న ఎమ్మెల్సీ పదవిని త్యజించి వైసీపీలో చేరారు. అయినా వైఎస్.జగన్ తన తొలి మంత్రివర్గంలో శిల్పా కుటుంబంలో చోటు కల్పించలేదు. శిల్పా చక్రపాణిరెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెడ్డి సామాజిక వర్గాల సమీకరణల్లోనే వీరికి మంత్రి పదవి దక్కలేదు. ఈ జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో బ్రదర్స్ భంగపడినట్లయింది.

No comments:
Write comments