కోతుల వీరంగాలు.. మహిళల ఆర్తానాదాలు

 

వనపర్తి జూలై 22 (globelmedianews.com)
మండల కేంద్రమైన గోపాల్ పేట లో రోజురోజుకు కోతుల బెడద తీవ్రంగా ఉండి ఇండ్ల పరిసర ప్రాంతాలలోకి, ఇండ్లలోకి చొచ్చుకొని వస్తుండడం పట్ల కోతులు బాబోయి కోతులు అంటూ మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ఇండ్ల కాంపౌండ్ లో వేసిన జామ ఇతర పండ్ల చెట్లపై దాడులు చేస్తూ పండ్లను తిని, కాయలను కొరికి పడేస్తున్నాడం వల్ల మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
కోతుల వీరంగాలు.. మహిళల ఆర్తానాదాలు

అదేవిధంగా కడగటానికి పెట్టిన వంట సామాగ్రిని కోతులు పట్టుకు పోతుండడం వల్ల మహిళల కేరింతల కు అంతులేకుండా పోయింది. ఎన్నికల సమయంలో కోతుల నివారణకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ గా పోటీ చేసిన వారు వాగ్దానాలపై వాగ్దానాలు గుప్పించారు తప్ప గెలిచిన ఏ ఒక్కరు కోతులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు . అధికారులు కానీ నాయకులు గాని కోతుల పై చర్యలు తీసుకొని వాటి బెడద నుంచి విముక్తి పరచాలని మహిళలు కోరుకుంటున్నారు.

No comments:
Write comments