జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి..

 

నిబంధనలు లేకుండా అక్రిడేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి..

సత్య వార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ
వనపర్తి జూలై 8 (globelmedianews.com):

ఎటు వంటి నియమ నిబంధనలు లేకుండా చిన్న పెద్ద పత్రికలు భేదాలు లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలను ఇవ్వాలని సత్య వార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎడిటర్ తాటికొండ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని. రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు సరైన వేతనాలకు నోచుకోక పేదరికంలో మగ్గుతున్నారు అని ఆయన అన్నారు. 
 జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి.. 

అదేవిధంగా వనపర్తి జిల్లా లో కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. కావున తమరు మా సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు.  హెల్త్ కార్డులపై అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను కల్పించాలని, అన్ని ఆసుపత్రులలో వైద్య సేవలను అందించాలని, మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి ఇచ్చే లక్ష రూపాయల నగదు సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలని కోరారు., జీవో 239 ని సవరించి చిన్న తరహా పత్రికలను ఆదుకోవాలని, సమాచార శాఖ కు మంత్రిని, పూర్తిస్థాయి కమిషనర్ను నియమించి శాఖ పనితీరును మెరుగు పరచాలని జర్నలిస్టులపై దాడులు నివారణకు రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులు రక్షణకు మహారాష్ట్ర తరహాలో చట్టం అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడబ్ల్యూ జెఎఫ్ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ. వనపర్తి సత్య వార్త బ్యూరో వి. అశోక్ కుమార్, నాగర్ కర్నూల్ టీ డబ్ల్యూ జెఎఫ్ రామచంద్రయ్య, జిల్లా ఇన్చార్జి పెద్ద గారి స్వామి, విలేకరులు శ్రీనివాసులు. జాంగిర్. గోపాల్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments