సిటీలో బల్క్ గార్బేజ్ ట్యాక్స్

 

హైద్రాబాద్, జూలై 1 , (globelmedianews.com)

స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా జీహెచ్ఎంసీ బ‌ల్క్ గార్బేజీ ప‌న్ను వ‌సూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు చెత్త‌ను ఇంటి నుంచి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు త‌ర‌లించేందుకు కార్మికులు రూ.50 వ‌సూలు చేసుకునే అధికారం క‌ల్పించింది. ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల నుంచి చెత్త త‌ర‌లించేందుకు ఛార్జీలు వ‌సూలు చేయ‌నుంది. నిత్యం వందకిలోల (క్వింటాల్‌) కన్నా ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే వాణిజ్య సంస్థల నుంచి కిలోకు రూ.2.25 చొప్పున బల్క్‌ గార్బేజీ చార్జీగా వసూలు చేసేందుకు ప్రతిపాదలను సిద్ధం చేసింది. వీటిని స్టాండింగ్‌ కమిటీ ముందుంచి, ఆమోదం పొందగానే అమలు చేయనుంది.

సిటీలో బల్క్ గార్బేజ్ ట్యాక్స్

బ‌ల్క్ గార్బేజ్ ప‌న్నులు అమ‌లు చేసిన‌ట్ల‌యితే చెత్త త‌ర‌లింపున‌కు జీహెచ్ఎంసీ చేస్తున్న ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. గ్రేట‌ర్‌లో దాదాపు 1.60ల‌క్ష‌ల క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లుండ‌గా … వారి పూర్తి వివ‌రాలు జీహెచ్ఎంసీ ద‌గ్గ‌ర లేవు. అంటే ఏ కంపెనీ నుంచి రోజుకు వంద కిలోల కంటే ఎక్కువ‌గా చెత్త ఉత్ప‌త్తి అవుతుందో లాంటి వివ‌రాలు లేనందున ఎవరిపై ఈ చార్జీలు విధించాలో అర్థం కాక ‘సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌’ను తెర‌పైకి తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ.భవిష్యత్తులో సర్వే చేసి గుర్తించిన సంస్థల నుంచి ఈ చార్జీలు వసూలు చేయనున్నారు.వాస్తవానికి రోజుకు పది కిలోలు మించి చెత్తను వెలువరించే వాణిజ్య సంస్థలన్నింటి నుంచి ఈ గార్బేజీ చార్జీలను వసూలు చేయాలని అధికారులు భావించారు. కానీ మున్సిపల్‌ సాలిడ్‌వేస్ట్‌ రూల్స్‌–2016 ప్రకారం రోజుకు వందకిలోల కంటే తక్కువ చెత్త వెలువరించే సంస్థలు బల్క్‌ వేస్ట్‌ జనరేటర్‌గా పరిగణనలోకి రావు. దీంతో న్యాయనిపుణుల సలహా మేరకు ఆ ఆలోచన విరమించుకున్నట్తు తెలుస్తోంది.

No comments:
Write comments