అతిగా స్పీడ్ నడిపే వాహనదారులకు బారిమూల్యము తప్పదు

 


జిల్లా ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల జూలై 03 (globelmedianews.com
అతిగా స్పీడ్ నడిపే వాహనదారులకు బారిమూల్యము తప్పదని జగిత్యాల జిల్లా ఎస్పీ సీంధు శర్మ ఆన్నారు. బుధవారం  ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈసందర్భంగా   ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ నేటి నుండి కంప్లీట్ గా ఈ చాలాన్ పద్ధతిని అమలు పరుస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎన్ఫోర్మెంట్ పద్దతిలో అనగా రహదారుల్లో వాహనాలు ఆపి తనకి చేసినప్పుడు హెల్మెట్,  డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్, త్రిబుల్ డ్రైవింగ్ తదితర అంశాలపై జరిమానా విధించడం జరిగిందన్నారు. 

అతిగా స్పీడ్ నడిపే వాహనదారులకు బారిమూల్యము తప్పదు

నాన్కంటాక్ట్ ఎన్ఫోర్మెంట్ ద్వారా అనగా కెమెరాలతో పిక్చర్స్ తీసి వారికి హెల్మెట్,డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్, త్రిబుల్ డ్రైవింగ్ తదితర అంశాలపై పూర్తిగా జరిమానా విధించడం అమలులోకి వస్తుంది అన్నారు.నేటి నుండి కొత్తగా స్పీడ్ లేజర్ ను ప్రారంభం చేశామన్నారు. ఈ స్పీడ్ లేజర్ ముఖ్య ఉద్దేశం లిమిట్ కు మించి వాహనాలు స్పీడ్ నడిపితే అట్టి వాహనాలను లేజర్ మిషెన్ చిత్రీకరించి జరిమాన ను చాలన్ నేరుగా వారి వారి ఇంటికి పోస్టులో వస్తుంది అన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం జగిత్యాల జిల్లాకు చెందిన ఆఫీసర్లు హజిముద్దీన్, భరద్వాజ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. ఈ స్పీడ్ గన్ 160 మిటర్ రేంజ్ ను పసి గడుతుంది అన్నారు.  ఈ గన్ లో వాహన దారుని స్పీడ్ లిమిట్  ఏరియా ను బట్టి హైవే రోడ్, ఆ ఏరియా రోడ్డు ఆ లేదా స్కూల్ రాడ్ బిజి రోడ్ దానిని బట్టి సెట్ చేసుకోవచ్చు అని తెలిపారు.కెమెరా రేంజ్ 160 కి మీ ఉంటుంది వేకిల్ పిక్చర్, నంబర్ ప్లేట్ రెండు చిత్రీకరిస్తాయి అని తెలిపారు. నాన్ కాంటాక్ట్ పద్దతి ద్వారా వాళ్ల ఇంటికి డైరెక్ట్ గా జరిమానా వెళ్లడం  జరుగుతుంది అన్నారు.  లేజర్ గన్ ను హైవే రోడ్ లలో కాకుండా పట్టణంలో కూడా ఏ ఏరియాలో ఎంత స్పీడ్ గా వెల్లాలో  సూచిస్తామన్నారు.

No comments:
Write comments