మున్సిపల్ ఎన్నికల్లో త్రీ కోణ పోటీ.?

 

టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ.
మెదక్, జూలై 13 (globelmedianews.com): 
హామీలు అమలు చేయనందున టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది . అన్ని పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరిన నాయకులు పోటీ ఎక్కువ అయింది . ఉద్యమం నుండి పార్టీ లో ఉన్న వారికి పార్టీ నాయకులు సమాచారం కూడా లేకపోవడం అసంతృప్తితో ఉన్నారు. వార్డుల విభజన అస్తవ్యస్తం గా ఉండడం కొందరిని అసంతృప్తికి గురి చేసింది. కులాల వారిగా, జనాభా ప్రాతిపదికన ,ఓటర్ల ప్రాతిపదికన విభజించాల్సిన వార్డులను మున్సిపల్ అధికారులు ఇష్టమైను రీతిలో విభజించడం రాజకీయ నాయకుల విమర్శలు గుప్పిస్తున్నారు. 
మున్సిపల్ ఎన్నికల్లో త్రీ కోణ పోటీ.?

టిఆర్ఎస్ పార్టీలో పోటీదారులకు కొన్నిచోట్ల అవకాశం లేక వేరే వార్డుల్లో పోటీ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు .గత అసెంబ్లీ, ఎంపీ ,జిల్లా పరిషత్ ఎన్నికలలో  ఫించన్లు రెండు వేలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం ఆ పార్టీకి కి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి టీ ఆర్ టి లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, హిందీ పండితులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం , యువత అసంతృప్తితో ఉన్నారు .ఇంటి ఆడపడుచు పాదాలను గంగమ్మ తో  కడిగిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన టిఆర్ఎస్ నినాదం నినాదంగా మిగిలింది. మెదక్ మున్సిపల్ పరిధిలో ఇంకా మిషన్ భగీరథ నీళ్లు రాక పోవడంతో వేసవిలో మహిళలు ఆందోళన చేసిన ఘటనలు ఉన్నాయి మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వార్డుల ప్రజలు ప్రభుత్వంపై వార్డ్ మెంబర్ లపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ మున్సిపల్ పరిధిలో నిర్మాణాలు ఆగిపోయాయి. మెదక్ ప్రధాన రహదారి నిర్మాణం ఆగిపోయింది. నాలుగు సంవత్సరాలు గడిచి ప్రతి వాహన దారి వాహనదారులకు మట్టి  దుమ్ము రావడంతో  ప్రమాదాలకు గురవుతున్నారు వైకుంఠ ధామం నిర్మాణం కాలేదు. మెదక్ జిల్లా జైలు కేంద్రం నిర్మాణం కాలేదు . రైతు బజార్ నిర్మాణం ఆగిపోయింది .మెదక్ పట్టణంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. దాంతో టిఆర్ఎస్ పార్టీ కి గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఈసారి ఎన్నికలలో తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ కి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మెదక్ పట్టణంలోని యువతను మున్సిపల్ పోరుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది  కాంగ్రెస్ పార్టీ లో నాయకత్వ లోపం ఉన్న కార్యకర్తలు పోటీకి వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో హాజరైన కార్యకర్తల ఉత్సాహమే నిదర్శనం.

No comments:
Write comments