పైసలిస్తేనే... పనులు జరిగేవి

 

హైద్రాబాద్, జూలై 12, (globelmedianews.com)
హైద్రాబాద్ నగర శివారుల్లో జోరుగా అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలా అపార్ట్‌మెంట్లలో గృహ ప్రవేశాలు చేసి అక్కడే ఉంటున్నాయి. చాలామంది ఇప్పటికే నీటి కనెక్షన్ల కోసం జలమండలికి దరఖాస్తులు చేసుకొన్నారు.నల్లాల విషయంలో భారీగా కమీషన్ల ముట్టే అవకాశం ఉండటంతో కొన్ని డివిజన్లల్లో కింది స్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. అపార్ట్ మెంట్లకు సంబంధించి ఒక్కో కనెక్షన్‌ నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, ఆపైనే కొందరు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంత జాప్యం చేస్తే...అంత పెద్ద మొత్తాలు కమీషన్ల రూపంలో దండుకోవచ్చుననే ఉద్దేశంతో కొందరు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. 
పైసలిస్తేనే... పనులు జరిగేవి

కొందరైతే మధ్యవర్తులను పెట్టుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇవన్నీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లక పోవడంతో వీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతోంది. కొందరైతే రూ.20 లక్షలు- రూ.30 లక్షల చొప్పున కనెక్షన్‌ ఫీజు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు చెల్లించాలి. ఇలాంటివి నగరం చుట్టూ పక్కల పెద్ద సంఖ్యలో ఉన్నాయి. చాలా అపార్ట్‌మెంట్ల కమిటీలు కనెక్షన్ల ఛార్జీలు చెల్లించిన వారి నల్లాలకు దిక్కుమొక్కూ ఉండటం లేదు. అధికారులను సంప్రదిస్తే రోడ్డు కటింగ్‌ అనుమతులు రావాలాని ఇంకా సమయం పడుతుందని దాటవేస్తున్నారని వాపోతున్నారు. కొత్త నల్లాల కోసం దరఖాస్తు చేస్తే.. నిర్ణీత సమయంలో జారీ చేస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. అర అంగుళమైతే 15 రోజుల్లో జారీ చేస్తున్నట్లు చెప్పారు. అదే అపార్ట్‌మెంట్లు ఇతర బహుళ అంతస్తుల నల్లాలైతే గరిష్ఠంగా మూడు నెలల్లో జారీ చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇదంతా ప్రకటనలకే పరిమితమని వినియోగదారులు వాపోతున్నారు. జలమండలి పరిధిలోని 22 డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఈ తరహా నల్లాలు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తు స్క్రూట్ని నుంచి కనెక్షన్‌ జారీ వరకు తీవ్ర జాప్యం చేసుకుంటోంది. ఆయా ప్రాంతాలకు కొత్తగా లైన్లు వేయాల్సి ఉంటే.. ఇక అంతేసంగతులు. ఏళ్లు గడిచినా ఇలాంటి నల్లాల జోలికి వెళ్లడం లేదు. నిర్ణీత భవనానికి 200-300 మీటర్ల దూరం నుంచి ప్రధాన లైన్లు వెళుతున్నా సరే.. అక్కడి నుంచి సమీపంలోని వాటికి కనెక్షన్లు ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వాస్తవానికి ఇలాంటి కనెక్షన్‌ కోసం ఎంత ఖర్చు అవుతుందో అంచాన వేస్తారు. ఆ మేరకు పనులకు టెండర్లు పిలుస్తారు. రూ.లక్షలోపు అయితే నామినేషన్‌ ప్రాతిపదికనే కేటాయిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు గరిష్ఠంగా మూడు నెలల సమయం ఎక్కువే. 

No comments:
Write comments