చంద్రబాబుపై కోపంతో ప్రజలు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు: నల్లు

 

మహబూబాబాద్ జూలై 18(globelmedianews.com
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో19 శాతం ఓట్లతో బీజేపీని ప్రజలు ఆదరించారని గుర్తుచేశారు. చంద్రబాబుపై కోపంతో ప్రజలు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు కానీ టీఆర్ఎస్‌ను చూసి వేయలేదన్నారు.
చంద్రబాబుపై కోపంతో ప్రజలు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు: నల్లు 

రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 2014లో సమగ్ర సర్వే అనేది టీఆర్ఎస్ పార్టీ కోసమేనని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కులాల పరంగా రాజకీయం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా సంస్థాగతంగా బలమైన జాతీయ పార్టీగా రూపుదిద్దుకోవడానికే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

No comments:
Write comments