ఇసుక మేటలతో ఇబ్బందులు

 

అదిలాబాద్, జూలై 9,(globelmedianews.com)
అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరుతుండగా.. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తం గా పలు మండలాల్లోని చెరువులు నిండిపోయాయి. నేరడిగొండ మండలం కుంటాల, బోథ్ మండలం పొచ్చర, బజార్‌హత్నూర్ మండలం కనకాయి జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ప్రవాహం పెరిగింది.  
ఇసుక మేటలతో ఇబ్బందులు

భీంపూర్ మండలం మత్తడి ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నీటిమట్టం 273.4 మీటర్లకు చేరింది. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టుకు 2192 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. భీంపూర్ మండలం జెండాగూడ, ఇంద్రవెల్లి మండలం మూత్నూర్, సిరికొండ మండలం పాండుగూడ చెరువులు నిండిపోయి మత్తడి మీదుగా నీరు ప్రవహించింది. ఆయా మండలాల్లోని చెరువు లు మత్తడి దూకుతున్నాయి. దీంతో స్థానికులు చేపలు పట్టడం కనిపించింది. సిరికొండ మండలం లచ్చింపూర్ గ్రామంలో దాదాపుగా 15 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేన్లలో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంద్రవెల్లి మండ లంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్య వసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుల్లోని ప్రవాహం దాటుకుంటూ వస్తున్నారు. రెండ్రోజులుగా కురుస్తోన్న వర్షాలు పత్తి, సోయాబీన్, కంది పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు అం టున్నారు. 

No comments:
Write comments