కృష్ణానది పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధి

 

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 

కొల్లాపూర్ జూలై 4,(globelmedianews.com)
కొల్లాపూర్ మండలం కృష్ణానది పరివాహక ప్రాంతంలో అమరగిరి, మల్లయ్య శిల, కోతి గుండులలో ఏకో టూరిజం పనుల ప్రతిపాదనల కోసం నల్లమల సరిహద్దు ప్రాంతంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, తెలంగాణ టూరిజం అధికారులతో కలిసి పర్యటించారు.  ఎకో టూరిజం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని ,కృష్ణానది పరివాహక ప్రాంతం అమరిగిరిలో కృష్ణానది వద్ద లక్నవరం తరహాలో భారీ వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ మేనేజర్ ను ఆదేశించారు.  

కృష్ణానది పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధి


అమరగిరి ప్రాంతంలో వ్యవసాయ పొలాలలో ఉన్న రైతులను పలకరించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మల్లయ్య శిల ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లయ్య శిల ఆలయానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తానని  గ్రామస్తులకు తెలిపారు.  ఈ ప్రాంత అభివృద్ధి కొరకు త్వరలో తెలంగాణ టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తో కలిసి పర్యటించి తెలంగాణ టూరిజం శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడు గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు తెలిపారు.ఎమ్మెల్యే గారి జిల్లా నాయకులు రత్న ప్రభాకర్ రెడ్డి గారు,టూరిజం అధికారులు ఉన్నారు

No comments:
Write comments