ఆశలన్నీ ఆగస్టు నెలపైనే

 

నల్గొండ, జూలై 9,(globelmedianews.com)
ఖరీఫ్‌ ఆశలన్నీ ఆగస్టుపైనే. ఇప్పటి వరకు జలాశయాలన్నీ ఖాళీ కుండల్ని తలపిస్తున్నాయి. ఎడమకాల్వ పరిధిలో ఖరీఫ్‌ వరిసాగుకు సాగర్‌ జలాలు రావడం నిరాశాజనకంగానే ఉంది. గతంలో మాదిరే ఆగస్టులో వరదలు వస్తే ఎగువ జలాశయాలు నిండి సాగర్‌కు ఇన్‌ఫ్లో స్థాయిలు పెరిగితే ముందస్తుగా రబీకి నీరు విడుదల చేసే అవకాశాలున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌, అక్టోబర్లలో వచ్చిన వరదలకు 570 వరకు వచ్చిన నీటిని రబీ అవసరాలకు వినియోగించుకున్నారు. రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టు కావడంతో నీటి పంపకాలు సమస్యగా మారుతున్నాయి. సాగర్‌లోకి వచ్చిన వరదంతా మనదే కాకపోవడంతో కొద్ది నిల్వలు వచ్చినా ప్రయోజనం ఉండటంలేదు. 
ఆశలన్నీ ఆగస్టు నెలపైనే

ఆంధ్రకు వాటా పోవాల్సి ఉండటంతో మనకు కచ్చితంగా ఖరీఫ్‌కు నీరొస్తుందనే నమ్మకం కుదరడంలేదు. అందుకే రైతుల ఆశలు రబీపైనే ఎక్కువగా ఉంటున్నాయి.2007-08లోనే. వరదలు, ఇన్‌ఫ్లో స్థాయి ఆశలన్నీ ఆగస్టులోనే. అందుకే రైతులు ఈసారి ఖరీఫ్‌పై ఆందోళన చెందుతున్నారు.సీజన్‌ ఆరంభమైనా ఇన్‌ఫ్లో పెరగలేదు. జూన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు చుక్క నీరు రాలేదు. జులైలో ఎంతవరకు వస్తాయో తెలియని పరిస్థితి. 11 ఏళ్లలో శ్రీశైలంలో జులై మాసంలో ఇన్‌ఫ్లో ఉన్నది కేవలం రెండేళ్లే. సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టులోని సుమారు 6.50 లక్షల ఎకరాలలో ఖరీఫ్‌ సాగు ఆగస్టు వచ్చే వరదలపైనే ఆధారపడి ఉంటుంది. జలాశయంలో ఉన్ననీటి నిల్వలు ప్రభుత్వం నిర్ధేశించిన కనీస నీటి మట్టం కంటే   ఎక్కువగా లేవు. (510 అడుగుల స్థాయిలో 132 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది) ప్రస్తుతం సాగర్‌లో 511 అడుగుల మేర అంటే 133 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీని నుంచి ఏ మాత్రం నీరు తీసుకోవడానికి అవకాశం లేదు. జులైలో సైతం నీరు వస్తుందనే ఆశలు కనిపించడంలేదు. ఎందుకంటే 11 ఏళ్లలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు కేవలం ఐదారు టీఎంసీలే. 2007-08 సంవత్సరంలోనే 283.47 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంది. ఆ తర్వాత పదేళ్ళలో ఎపుడూ 21 టీఎంసీల కంటే ఎక్కువ రాలేదు. శ్రీశైలంలోనూ అదే పరిస్థితి. 2007-08లో జులైలో 409 టీఎంసీల నీరు వచ్చింది. అదే 2013-14లో జులై ఇన్‌ఫ్లో 219 టీఎంసీలు. ఆతర్వాత ఇన్‌ఫ్లోలు నామమాత్రంగానే ఉన్నాయి. సాగర్‌లో 510 అడుగుల కంటే దిగువన నీరు ఉంటే వినియోగించుకోవడానికి అవకాశం లేదు. సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని మొదటి జోన్‌లో 3.84 లక్షల ఎకరాలలో, రెండవ జోన్‌ పరిధిలో 2.70 లక్షల ఎకరాలలో ఖరీఫ్‌ వరిసాగు చేపడుతున్నారు. మొదటి జోన్‌లో ఖరీఫ్‌ అవసరాలకు 25-30 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. రెండవ జోన్‌కు 20-22 టీఎంసీల నీరు అవసరం. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు పడి వరదలు వచ్చి జులై చివరికి ఎగువ జలాశయాలు నిండి మనకు వదిలితే ఆగస్టులో నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. కర్ణాటకలో వర్షాలు పడుతున్నా అవి అంతంతమాత్రంగానే ఉన్నాయి. రెండుమూడు రోజుల తర్వాత వరదలు తగ్గుముఖం పట్టనున్నాయి. తుంగభద్రకు, అల్మట్టి మినహా (తుంగభద్రకు 6300 క్యూసెక్కులు, అల్మట్టికి 32,830 క్యూసెక్కుల వరదవస్తుంది)ఇతర జలాశయాలకు వరదలు లేవు. శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరదలు రావాలంటే పూర్తిగా జూరాల, నారాయణపూర్‌, అల్మట్టిపైనే ఆధారపడాలి. ఎగువన జలాశయాలలో సైతం పుష్కలంగా నీరు లేదు. అల్మట్టికి 86 టీఎంసీలు, తుంగభద్రకు 63 టీఎంసీలు, జూరాలకు 4 టీఎంసీలు, నారాయణపూర్‌కు 13 టీఎంసీలు, శ్రీశైలానికి 186 టీఎంసీల నీరు వస్తే నిండుతాయి. ఆ తర్వాతే సాగర్‌కు వచ్చేది.

No comments:
Write comments