సిటీ కాంగ్రెస్ లో కనిపించని ఉత్సాహం

 

నడిపించే నాయకుడు కోసం ఎదురు చూపులు
హైద్రాబాద్, జూలై 9, (globelmedianews.com)
సిటీ కాంగ్రెస్లో అయోమయం నెలకొంది. గ్రేటర్ పార్టీని నడిపించేందుకు నాయకుడే లేడా? అన్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ అధ్యక్షుడిగా అంజన్కుమార్యాదవ్ ఉన్నప్పటికీ చాలాకాలంగా ఆయన స్తబ్థంగా ఉండిపోవడంతో పార్టీ శ్రేణులది ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒకవైపు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ను వీడుతుండడం.. మరోవైపు పార్టీలో కొనసాగుతున్న నేతల మధ్య సమన్వయం లేకపోవడం.. ఇంకోవైపు ముఖ్యనేతలు అవలంభిస్తున్న తీరుతో గ్రేటర్ కాంగ్రెస్లో అయోమయం నెలకొంది.  దీనికితోడు  పార్టీ హైకమాండ్ నుంచి గానీ రాష్ట్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం చేసేవారు లేకపోవడంతో పార్టీ క్యాడర్ సందిగ్ధంలో పడింది.దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌‌ పార్టీ.. ఒకప్పుడు గ్రేటర్‌‌లో ఒక వెలుగు వెలిగింది. పార్టీ పరిపాలన సాగిన వేళ సిటీ కాంగ్రెస్కు ఉన్న చరిష్మానే వేరు. ఇంకా చెప్పాలంటే నగరం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించే ముఖ్యులకు సీఎం నుంచి మొదలు హైకమాండ్ వరకు ఎనలేని ప్రాధాన్యం ఉండేది. ప్రస్తుతానికి సిటీ కాంగ్రెస్ ఇందుకు భిన్న పరిస్థితులు ఎదుర్కొంటోంది.  
సిటీ కాంగ్రెస్ లో కనిపించని ఉత్సాహం

అసలు అప్పటి రాజసం..ఆ  వైభవం ఇప్పుడెక్కడా కనిపించడం లేదు ఇదిలాఉంటే ఇటీవల  కొన్ని సంఘటనల నేపథ్యంలో సర్కారును నిలదీయడం లాంటి వంటి కార్యక్రమాలలో కూడా అందర్నీ ఒకతాటిపై తేవడంలో ఆయన విఫలం అయ్యారనే పార్టీలోంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మొన్నటి ఎన్నికల తరువాత గ్రేటర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ఎలాంటి యాక్టివిటీ లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. తెలంగాణలో తొలిసారిగా జరిగిన గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్ చతికిల పడింది.  అంతకుమునుపు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని దక్కించుకుంటే.. ఆ తరువాత సిటీలో పెద్దగా  కార్పొరేటర్ సీట్లను సాధించుకోలేకపోయింది.  ఆ సమయంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్తుత ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొనసాగారు. సిటీలో కార్పొరేటర్ల ఓటమితో పార్టీలో  వ్యతిరేకత ఎదురవ్వడంతో ఆ తరువాత కొద్దికాలానికే దానం పదవిని వీడారు. ఆపై పార్టీ రాష్ట్ర నాయకత్వం గ్రేటర్ అధ్యక్ష పగ్గాలను సికింద్రాబాద్ ఎంపీగా, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా ఉన్న అంజన్కుమార్యాదవ్కు అప్పగించింది.అయితే, గ్రేటర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం కూడా తగ్గుతూ వచ్చింది. గులాబీ వనంలోకి కాంగ్రెస్ ముఖ్యులు క్యూ కడుతుండడంతో పార్టీ సీన్ మారిపోయింది. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర రానూరానూ తగ్గుతూ వచ్చింది. పార్టీ సమావేశాల మినహా సిటీలో పెద్దగా ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించడంలో పార్టీ విఫలమైంది. నగరంలోని గాంధీభవన్లోనే సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఉండడం, రాష్ట్రనాయకత్వం మీటింగ్లలోనే గ్రేటర్ నేతలు పాలుపంచుకుని వెళ్లిపోయారు. సిటీ మీటింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు. వాస్తవంగా చెప్పాలంటే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ విధానాలు, చేపడుతున్న పనులపై వ్యతిరేకరించడంలో సిటీ కాంగ్రెస్ ముందుడగు వేయలేకపోయింది. ఒకానొక దశలో పార్టీలోని నేతల్లోనే సమన్వయం లోపం కొట్టొచ్చినట్లు కనిపించేది.ఆ తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పూర్వవైభవానికి ప్రయత్నాలు ఆరంభించింది. సిటీ కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యే టికెట్ వేటలో పార్టీ హైకమాండ్, రాష్ట్ర అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆదిశగా పావులు కూడా కదిపారు. ఈ విషయంలో గ్రేటర్ అధ్యక్షుడు అంజన్కుమార్యాదవ్ తనయుడు అనిల్కుమార్కు ముషీరాబాద్ నుంచి టికెట్ ఇప్పించుకోగలిగాడు. మరికొందరు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, మరికొందరు ముఖ్యులు కూడా తమవారికి టికెట్లు ఇప్పించుకోలేకపోయారు. ఆ సమయంలో పార్టీ పెద్దలపై అసంతృప్తులు, వ్యతిరేకతలు తీవ్రమయ్యాయి. ఒకానొక దశలో టికెట్ లభించకపోవడంతో పార్టీని వీడగా, ఇంకొందరు రెబల్స్ బరిలో నిలిచి కాంగ్రెస్ ఓట్లను చీల్చారు. ఇలా గ్రేటర్లో పార్టీ పడుతూ లేస్తూ నాయకత్వం లేమితో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో కొలుకోని దెబ్బతగిలింది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మేడ్చల్ పార్లమెంట్ స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మూడు స్థానాలు చేజారిపోయాయి. ఒకే ఒక్క మేడ్చల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్రెడ్డి గెలుపు పార్టీకి కొంత ఊరట నిచ్చింది. స్వయంగా పార్టీకి గ్రేటర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంజన్కుమార్యాదవ్ సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఫలితాల్లో మాత్రం మూడో నెంబర్కు పడిపోయారు. దాంతో ఆయన అప్పటి నుంచి గ్రేటర్లో ఎక్కడా  క్రియాశీలక పాత్ర కనిపించలేదు.  దీనికితోడు పార్టీకి పెద్ద దిక్కు కరువవ్వడంతో  కిందిస్థాయి  క్యాడర్ నుంచి నాయకులు, నేతలు తలో దిక్కుకు వెళ్లిపోయారు.  దీంతో పార్టీ  శ్రేణుల్లో నైరాశ్యం ఆవరించిది.  చెప్పాలంటే.

No comments:
Write comments