మంచి ఎనర్జిటిక్ గా ఇస్మార్ట్ రామ్

 

హైద్రాబాద్, జూలై 4  (globelmedianews.com)

‘పిల్లి గుడ్డిదైతే ఎలుకు ఎగిరెగిరి చూపించిందట.. నీ జాతినా పుల్లా’.. ఈ డైలాగ్ వింటే ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మాస్ మసాలా మూవీ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్‌లో రామ్ ఎనర్జీ కాస్త ఎక్కువైందనే విమర్శలు రాగా.. ట్రైలర్‌లో అంతకుమించే ఎనర్జీని చూపించారు రామ్. పూరీ మార్క్ టేకింగ్‌కి రామ్ హై ఓల్టేజ్ యాక్షన్‌తోడు కావడంతో ట్రైలర్ ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ లెక్కే ఉంది. ‘డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది’గా రామ్ యాక్షన్ బాగా శృతిమించినట్టుగా కనిపిస్తోంది. 

మంచి ఎనర్జిటిక్ గా ఇస్మార్ట్ రామ్

తెలంగాణ యాసలో రామ్ పలికించే పవర్ ఫుల్ మాస్ మసాలా డైలాగ్స్ పట్టి పట్టిచెప్తున్నట్టుగా అతని సూట్ కాలేదు. ‘నీ జాతినా పుల్లా’ అంటూ రామ్ పలికించే డైలాగ్స్ వెగటుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. పూరీ మార్క్ ఆరబోతకు నాటు డైలాగ్స్‌కి కొదువేలేదు. ‘రేయ్.. వరంగల్ కాలేజ్‌లా పోరగాళ్లను ఉచ్చ పోయించినా’ అంటూ నభా నటేష్ ఓ రేంజ్‌లో చెప్తున్న డైలాగ్ ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది. మరో పోరి నిధి అగర్వాల్.. గ్లామర్ షోకి తెరతీస్తూనే కథలో కీలకంగా కనిపిస్తోంది. నిజానికి రామ్ సినిమాల్లో ఎనర్జీ ఎక్కువైతే ప్రేక్షకులకు ఓవర్‌లా కనిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ ఎనర్జీ డబుల్ కావడంతో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ని ఎలా తట్టుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుర్రలో చిప్ పెట్టుకుని సగం మెంటల్, సగం బోజ్ పూరి విలన్‌లా కనిపిస్తున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ తేడాగానే కనిపిస్తున్నాడు. ఇక టెంపర్ సినిమా తరువాత సరైన హిట్ లేకపోవడంతో తన టెంపర్ మొత్తాన్ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ చూపించేశారు దర్శకుడు పూరీ. ఈ ఎనర్జిటిక్ టెంపర్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో జూలై 18న తేలిపోనుంది. 

No comments:
Write comments