సిరిసిల్ల మున్సిపల్ ప్రత్యేక అధికారి గా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్

 


 సిరిసిల్ల  జులై 03(globelmedianews.com)
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పాలకవర్గం గడువు మంగళవారం  తో  ముగియగా బుధవారం ఉదయం  సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రత్యేక  అధికారిగా  జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు ముందు  సిరిసిల్ల మున్సిపాలిటీ కార్యాలయం కు వెళ్ళగా,  సిరిసిల్ల మున్సిపాలిటీ  కమీషనర్ డా . కె వి రమణా చారి మొక్క ను బహుకరించి స్వాగతం పలికారు. 


సిరిసిల్ల మున్సిపల్ ప్రత్యేక  అధికారి గా   జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ 
అనంతరం మున్సిపాలిటీ ప్రత్యేక  అధికారిగా బాధ్యతలు సీకరించి, పలు రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై అన్ని విభాగాల అధిపతులతో సమీక్షిస్తామని తెలిపారు.

No comments:
Write comments