చిన్న సమస్యలకే ఆత్మహత్యలు...

 

హైద్రాబాద్, జూలై 25, (globelmedianews.com)
బ్యూటీపార్లర్ పెట్టి భర్తకు ఆర్థిక సహాకారాన్ని అందించాలనుకున్న ఓ వివాహిత.. నిర్వహణలో నష్టాలు రావడంతో మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మూరు గ్రామానికి చెందిన కె. గోపాలకృష్ణ అదే ప్రాంతానికి చెందిన సత్య శిరీష(35)ను 2001లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 16 ఏళ్ల కుమారుడు భాను శ్రీకృష్ణ సుమంత్ ఉన్నాడు. ఆరేళ్ల క్రితం గోపాలకృష్ణ కుటుంబంతో సహా సిటీకి వచ్చి కేపీహెచ్ బీ కాలనీ రోడ్డు నం.5 ఎల్ ఐజీ 827లో ఉంటున్నాడు.గోపాలకృష్ణ స్థానికంగా ఉన్న ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణ భార్య శిరీష  కేపీహెచ్ బీ కాలనీలోనే బ్యూటీపార్లర్ నడిపేది. కొన్నిరోజుల తర్వాత బ్యూటీపార్లర్ నిర్వహణలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. 
చిన్న సమస్యలకే ఆత్మహత్యలు...

దీంతో శిరీష మనస్థాపానికి గురై ఈ నెల 22న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు సాయంత్రం 6.30గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన గోపాలకృష్ణ..ఉరేసుకున్న శిరీషను చూసి వెంటనే స్థానికుల సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ శిరీషను పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. గోపాలకృష్ణ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.భర్తతో గొడవ ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ హాస్పిటల్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ దేవేందర్ చెప్పారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన యేసుపోగు చిరంజీవి(35)కి అదే ప్రాంతానికి చెందిన కుమారి(23)తో 12 ఏండ్ల క్రితం పెళ్లైంది. కొన్నేళ్ల తర్వాత భార్యభర్తలు ఇద్దరు సిటీకి వచ్చి..అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఉన్న  కొత్తగూడెం వద్ద టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. ఈ నెల 15న కుమారి భర్తతో గొడవపడింది. ఆ తర్వాత చీరతో బాత్రూంలో కుమారి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు వెంటనే కుమారిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ కుమారి సోమవారం అర్ధరాత్రి చనిపోయింది. మృతురాలి తల్లి ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఉరేసుకుని చనిపోయిన ఘటన ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం..నాగర్ కర్నూల్ జిల్లా కొత్తపల్లికి చెందిన అతినారపు శ్రీను(40) అదే ప్రాంతానికి చెందిన కురువతమ్మ(35)తో 15 ఏండ్ల క్రితం పెళ్లైంది. పెళ్లయిన తర్వాత భార్యతో పాటు సిటీకి వచ్చిన శ్రీను నాగోల్ లోని జైపురి కాలనీలో ఉంటూ కూలీపనిచేస్తున్నాడు. శ్రీను, కురువతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కురువతమ్మ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి కురువతమ్మను కిందకి దించి చూడగా..ఆమె అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించామని..ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.చదువు ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా బాలాపూర్ కి చెందిన వల్లదాసు పెద్దయ్య,అలివేలు దంపతుల పెద్ద కూతురు మౌనిక(17) టెన్త్ క్లాస్ వరకు చదివింది. మౌనికను హాస్టల్ లో చేర్పించేందుకు మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయించారు. మౌనికకు సిద్ధిపేటలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ హాస్టల్ లో సీటు వచ్చింది. ఆమెను తల్లిదండ్రులు హాస్టల్ లో జాయిన్ చేయించారు. మౌనికకు అక్కడ చదువుకోవడం ఇష్టం లేకపోవడంతో సోమవారం ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో మౌనిక ఫ్యాన్ కి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పని మీద బయటికెళ్లి ఇంటికి వచ్చిన మౌనిక తల్లి అలివేలు..ఫ్యాన్ కి వేలాడుతున్న కూతురి చూసి స్థానికుల సాయంతో కిందికి దింపించింది. అప్పటికే మౌనిక చనిపోయి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మత్తు లో యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మూసారంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. మలక్ పేట ఇన్ స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన ఎరుకల బిందు(24) మలక్ పేట, ముసారాంబాగ్ పరిసరాల్లో ఫుట్ పాత్ పై ఉన్న చెత్తకాగితా లు ఏరుకుంటూ ఉండేది. మంగళవారం మధ్యాహ్నం మద్యం తాగి న బిందు ముసారాం బాగ్ మెట్రో రైల్ స్టేషన్ పైకి ఎక్కి పై నుంచి దూకేందుకు యత్నించింది. దీన్ని గమనించిన మెట్రో సెక్యూరిటీ సిబ్బంది బిందును కాపాడారు. వెంటనే మలక్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను వారికి అప్పగించారు. బిందుకు కౌన్సెలింగ్ ఇచ్చి.. బంధువులకు అప్పగించినట్టు మలక్ పేట పోలీసులు తెలిపారు.

No comments:
Write comments