కర్ణాటక ఎపీసోడ్ తో దేశవ్యాప్త చర్చ

 

బెంగళూర్, జూలై 30, (globelmedianews.com)
కర్ణాటక శాసన సభలో స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం బిజెపికి కొరుకుడు పడకపోయినా ఎపి వైసిపి మాత్రం చక్కగా ఉపయోగించుకుంటుంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశారు కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్. కేవలం అనర్హత వేటు మాత్రమే కాకుండా నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జంప్ జిలానీలకు గట్టి షాక్ నే ఇచ్చారు. 14 మంది ఎమ్యెల్యేలపై ఒకేసారి వేటు వేసేసారు స్పీకర్. కుమార స్వామి బలపరీక్ష తరువాత ముగ్గురి పై ఓటు వేసిన స్పీకర్ యడ్యూరప్ప బలనిరూపణకు ముందు మిగిలిన వారిని కోలుకోలేని దెబ్బకొట్టారు. మంత్రి పదవులకోసం అత్యాశకు పోయినవారికి వున్నపదవే లేకుండా చేసేసారు. 
కర్ణాటక ఎపీసోడ్ తో దేశవ్యాప్త చర్చ

ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం ఫిరాయింపులను ప్రోత్సహించే వారికి మద్దతిస్తున్న స్పీకర్లకు చెంపపెట్టుగా మారింది.ఎపి లో గత ప్రభుత్వంలో స్పీకర్ గా కోడెల శివ ప్రసాదరావు వ్యవహారాన్ని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తీరు వైసిపి ఇప్పుడు తన మీడియా లో ఎత్తిచూపిస్తుంది. 23 మంది ఎమ్యెల్యేలు వైసిపిని వీడి టిడిపి లోకి జంప్ అయినా స్పీకర్ గా కోడెల ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ కి అడుగులకు మడుగులు వత్తారని రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకున్న తీరుపై మరోసారి దుమ్మెత్తిపోస్తున్నారు వైసిపి వర్గాలు. వారిలో నలుగురిని మంత్రులు కూడా చేసినా స్పీకర్ చర్యలు తీసుకోలేదంటున్నారు.అక్కడ చూడండి, ఇక్కడ చుడండి ఎలా జరిగిందో అని తమ పార్టీ అనుకూల మీడియా లో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎఫెక్ట్ తో టిడిపి నేతలకు ఇప్పుడు గట్టిగా ఎదురుదాడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. నీతులు చెప్పే చంద్రబాబు చేసే పనులు మాత్రం భిన్నంగా వుంటాయని కోడెల ఉదంతమే సాక్ష్యమని వైసిపి తన కసి అంతా తీర్చుకోవడానికి కర్ణాటక అంశం తో పోలుస్తూ చేస్తున్న దాడి భవిష్యత్తులో కూడా టిడిపిపై నడిచే లాగే వుంది. మొత్తానికి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు కర్ణాటక ఎపిసోడ్ తమ్ముళ్లకు ముఖ్యంగా మాజీ స్పీకర్ కి తలవంపు గా మారింది.

No comments:
Write comments