సొంత ఎంపీలతో సోనియా భేటీ న్యూస్

 

న్యూఢిల్లీ, జూలై 24(globelmedianews.com):
గ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ.. తమ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలతో ఇవాళ సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. 
 సొంత ఎంపీలతో సోనియా భేటీ న్యూస్ 

కాంగ్రెస్‌ - జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. దీంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కూడా సొంత పార్టీ సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులతో ఇవే అంశాలపై చర్చించారు.

No comments:
Write comments