రాజకీయంగా రాటు దేలుతున్న జగన్

 


గుంటూరు, జూలై 2, (globelmedianews.com)
వైసీపీ అధినేత జగన్ కి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. రాజకీయ రణక్షేత్రంలో ఒంటరి పోరుకే జగన్ ఎపుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన పొత్తు కోసం అనేక పార్టీలు రెడీ అయినా కూడా జగన్ ససేమిరా అనేశారు. ఇక ఏపీలో అనుకున్నట్లుగానే బంపర్ మెజారిటేతో జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ కి ఇపుడు ఏపీలో ఎదురులేదు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఉన్నా ఆ పార్టీ పాత్ర నామమాత్రమే. చంద్రబాబు ఔట్ డేటెడ్ పాలిటిక్స్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక ఆ పార్టీలో బాబు తరువాత అంతటి నాయకత్వం కూడా ఎక్కడా కనిపించడంలేదు. దాంతో జగన్ కి టీడీపీ నుంచి పెద్దగా ముప్పు కనిపించడంలేదు. 


రాజకీయంగా రాటు దేలుతున్న జగన్
ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇపుడు తామే రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ అంటోంది. ఫిరాయింపులను ప్రోత్సహించైనా ఏపీలో పవర్లోకి రావాలన్నది బీజేపీ ఎత్తుగడ. చూడబోతే జగన్ కి బీజేపీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మోడీ, షా మొండితనం అందరికీ తెలుసు. వారు అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగిస్తారు ఏపీలో జగన్ని కొట్టేందుకు సామ దాన భేద దండోపాయాలు కూడా వెతుకుతారు. దాంతో జగన్ దూరద్రుష్టిలో ఆలోచిస్తున్నరని అంటున్నారు. బీజేపీ కంటే టీడీపీ బెటర్ అన్నది జగన్ ఆలోచనగా ఉందిట. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా సునాయాసంగా వైసీపీ విజయం సాధిస్తుందని వైసీపీ వ్యూహకర్తలు అంటున్నారు.జగన్ రాజకీయంగా రాటుదేలారు. బీజేపీతో తనకు ముందు ముందు ఇబ్బంది అని జగన్ కి బాగా తెలుసు. అదే సమయంలో ఏపీ కష్టాల్లో ఉంది. అందువల్ల ఆయన కాస్తా మెత్తగా బయటకు కనిపిస్తున్నారు. కేంద్ర సాయం అవసరం అన్న ఒక్క కారణంతోనే కమలం దూకుడుని భరిస్తున్నారు. అయితే ఇది ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదు. కమలం కస్సుమంటే జగన్ సైతం బుస్సుమంటారు. ఇప్పటికే ఆయన ఏపీలో బీజేపీకి దారులు మూసేందుకు తన ఏర్పాట్లలో తాను ఉన్నారు. ఏపీలో ఫిరాయింపులను అడ్డుకుంటాం అని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పడం వెనక చంద్రబాబు పై ఉన్న ప్రేమ కంటే బీజేపీకి కట్టడి చేసే గట్టి వ్యూహం దాగుంది. మరి చూడాలి బీజేపీకి కట్టడి చేయడానికి జగన్ ఏం చేస్తారో.

No comments:
Write comments