సీజ‌న‌ల్ వ్యాధుల‌పై బ‌ల్దియా స‌మ‌రం

 

హైదరాబద్ జూలై 12 (globelmedianews.com)
ప్ర‌స్తుత వ‌ర్షాకాల సీజన్‌లో ఏవిధ‌మైన అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు చేప‌ట్టిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా గ్రేట‌ర్ ప‌రిధిలో ఉచిత వైద్య శిబిరాల నిర్వ‌హ‌ణ‌ను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు న‌గ‌రంలోని అన్ని మురికి వాడ‌ల్లో దోమ‌ల నివార‌ణ మందు స్ప్రేయింగ్‌తో పాటు 500 వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తొలి విడ‌త‌లో 275 వైద్య శిబిరాల ఏర్పాటుకు ఉత్త‌ర్వులు జారీచేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని హైద‌రాబాద్ జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చ‌ల్ జిల్లాలో 99 హెల్త్ క్యాంపుల‌ను ఏర్పాటు చేస్తూ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు. 
సీజ‌న‌ల్ వ్యాధుల‌పై బ‌ల్దియా స‌మ‌రం

జిల్లా వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారులు, జిల్లా మ‌లేరియా అధికారులు, జీహెచ్ఎంసీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్లు, ఎంట‌మాల‌జి విభాగం అధికారులు సంయుక్తంగా ఈ వైద్య శిబిరాల‌ను గ్రేట‌ర్ ప‌రిధిలోని అంటువ్యాధులు ప్ర‌బ‌లే స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌ధానంగా గ‌త సంవ‌త్‌‌రాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌లిన బ‌స్తీలు, కాల‌నీల్లో ఈ హెల్త్ క్యాంపులు  ఏర్పాటు చేస్తున్న‌ట్టు అన్నారు. హెల్త్ క్యాంపుల‌తో పాటు దోమ‌ల వ్యాప్తి నిరోధానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి విభాగం ఏఎల్ఓ టీమ్, జిల్లా మ‌లేరియా హెల్త్ అసిస్టెంట్‌లు, హెల్త్ సూప‌ర్‌వైజ‌ర్లు, వైద్య ఆరోగ్య‌శాఖ‌కు చెందిన ఆశ‌, ఏఎన్ఎంలతో కూడిన ప్ర‌త్యేక క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు దాన‌కిషోర్ పేర్కొన్నారు. ప్ర‌తి హెల్త్ క్యాంపుకు వైద్యాధికారితో పాటు అర్బ‌న్ పబ్లిక్ హెల్త్ సెంట‌ర్ సిబ్బంది, ఏ.ఎన్‌.ఎంలు, హెల్త్ అసిస్టెంట్‌లు, హెల్త్ సూప‌ర్‌వైజ‌ర్లు, ఆశ వ‌ర్క‌ర్లు హాజ‌ర‌వుతారు. ఇంటింటికి లార్వా నివార‌ణ స్ప్రేయింగ్‌ను జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి బృందాలు చేప‌ట్ట‌డంతో పాటు ఫాగింగ్ ఆప‌రేష‌న్లు కూడా నిర్వ‌హిస్తాయ‌ని క‌మిష‌న‌ర్ వివ‌రించారు. వ‌ర్ష‌కాలం సంద‌ర్భంగా వ‌చ్చే వ్యాధుల నిరోధంపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై హెల్త్ అసిస్టెంట్‌లు, హెల్త్ సూప‌ర్‌వైజ‌ర్లు, ఏ.ఎన్‌.ఎంలు, ఆశ వ‌ర్క‌ర్లు, ఎంట‌మాల‌జి విభాగం సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవ‌గాహ‌న‌, చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పై జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఎంట‌మాల‌జి అధికారులు, ఈ.ఎఫ్.ఏలు, మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్‌లు పూర్తిస్థాయిలో ప‌ర్య‌వేక్షిస్తారు. ప్ర‌తి అర్బ‌న్ ప‌బ్లిక్ హెల్త్ సెంట‌ర్లు, క‌మ్యునిటి హెల్త్ సెంట‌ర్ల‌లో స్వైన్‌ప్లూ, డెంగ్యు వ్యాధి నిర్థార‌క కిట్‌లు, మ‌లేరియా ర్యాపిడ్ డ‌యాగ్న‌స్టిక్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉంటాయ‌ని దాన‌కిషోర్ పేర్కొన్నారు. ఎక్క‌డైనా డెంగ్యు, మ‌లేరియా, స్వైన్‌ప్లూ త‌దిత‌ర అంటువ్యాధులకు సంబంధించి పాజిటీవ్ కేసులు న‌మోదు అయితే అవి మ‌రింత విస్త‌రించ‌కుండా ఉండేందుకు సంబంధిత జీహెచ్ఎంసీ వైద్యాధికారులు అర్బ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ మెడిక‌ల్ అధికారులు యుద్ద ప్రాతిప‌దిక‌పై చ‌ర్య‌లు చేప‌డుతార‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. రెండు అంత‌కన్నా ఎక్కువ సంఖ్య‌లో పాజిటీవ్ కేసులు న‌మోదు అయితే ఆయా ప్రాంతాల్లో క‌నీసం వంద ఇళ్ల‌లో యాంటి లార్వా ఆప‌రేష‌న్ల నిర్వ‌హ‌ణ‌, 50 ఇళ్ల‌లో పెరిత్రీయం స్ప్రేను చ‌ల్లాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసిన‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి పాఠ‌శాల‌లు, వార్డులు, స‌ర్కిల్ కార్యాల‌యాలు, ఇత‌ర ప్ర‌ముఖ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివార‌ణ పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు దాన‌కిషోర్‌ పేర్కొన్నారు. గ‌త సంవ‌త్స‌రం 287 హెల్త్ క్యాంప్‌లు న‌గ‌రంలో నిర్వ‌హించ‌గా ప్ర‌స్తుతం వీటిని 500లకు పెంచామ‌ని పేర్కొన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న దాదాపు 6వేల‌కు పైగా పాఠ‌శాల‌లో అంటువ్యాధులు, దోమ‌ల నివార‌ణ‌పై విద్యార్థినీవిద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌, చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి పాఠ‌శాల, సంస్థ‌లు ఇళ్ల‌లోనూ నీటి నిల్వ‌లు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. న‌గ‌రంలోని ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో మ‌లేరియా, డెంగ్యు, మెద‌డువాపు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చే రోగుల వివ‌రాల నివేదిక‌ను ప్ర‌తిరోజు జీహెచ్ఎంసీ కార్యాల‌యంకు అందించాల‌ని ఆదేశించారు.  జులై మాసాన్ని డెంగ్యు నివార‌ణ మాసంగా పాటిస్తున్నామ‌ని తెలిపారు.

No comments:
Write comments