హరీష్ రావు పరిస్థితి ఏమిటిప్పుడు

 

కొడంగల్,జూలై 20 (globelmedianews.com)
కొడంగల్ ప్రజల రుణం  ఏమిచ్చినా తీర్చుకోలేనని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అయన మొదటిసారి ఎంపిగా కొడంగల్ లో పర్యటించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే  పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందoట. అలాంటి పరిస్థితి హరీష్ రావ్ కు వచ్చిందని వ్యాఖ్యానించారు. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన తరువాత  మొదటిసారిగా  కొడంగల్ నియోగజక వర్గం కోస్గిలో జరిగిన అభినందన సభకు ఎంపీ రేవంత్ రెడ్డి హాజరవుతున్నందుకు అనందంగా వుందన్నారు.
హరీష్ రావు పరిస్థితి ఏమిటిప్పుడు

అనంతరం శివాజీ చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గoలో  10 ఏళ్ళలో నేను చేసిన అభివృద్ధి తప్ప, తెరాస  ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని ఒకవేళ చేసినట్టు నిరూపిస్తే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో నన్ను ఓడగొట్టడానికి కేసీఆర్ హరీష్ రావు ని పంపిస్తే. అదే హరీష్ రావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఇప్పుడు ఎంపీ గా గెలిచిన నాకు ..కొడంగల్ ప్రజల నాడీ పార్లమెంట్ లో వినిపించే అవకాశం వచ్చిందని అన్నారు. కొడంగల్ ప్రజలకు అనునిత్యం అండగా ఉంటానని మిమ్ములని కాపాడుకునే బాధ్యత  నాదని అన్నారు. రానున్న మున్సిపాల్టీ ఎలక్షన్లో  కొడంగల్ మొత్తం కాంగ్రెస్  జండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు

No comments:
Write comments