బిగ్ బాస్ బ్యాన్ చేయండి

 

హైద్రాబాద్, జూలై 22 (globelmedianews.com)
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమయ్యింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా 15 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. 100 రోజుల పాటూ ఈ సందడి కొనసాగనుంది. ఇక ఈ షో ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు చుట్టిముట్టిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా.. కమిట్‌మెంట్ పేరుతో తమను వేధించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ కోర్టు జోక్యంతో బిగ్‌‌బాస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు అంటుకుంటోంది. బిగ్‌బాస్ షోపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. 
బిగ్ బాస్ బ్యాన్ చేయండి

కన్నా తన ట్వీట్‌లో బిగ్‌ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. నేరుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ‘బిగ్ బాస్-సిరీస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అన్నారు. బిగ్ బాస్-సీరీస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది.తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కన్నా లక్ష్మీనారాయణ ఈ ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బిగ్‌బాస్‌‌పై చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బీజేపీ భావజాలం ఇలాంటి రియాల్టీ షోలకు వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పాలి. అలాగే బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలో ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా మైలేజ్ కోసం బిగ్‌ బాస్‌ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ఈ వివాదంపై స్పందించ లేదు. 

No comments:
Write comments