అధికారం నాకు అలంకారం కాదు... మీరు నాకు ఇచ్చిన బాధ్యత

 


నేను మీ సేవకురాలిని..ఎమ్మెల్యే ఆదిరెడ్డి 
రాజమహేంద్రవరం జూలై 3 (golbelmedianews.com)
అధికారం తనకు అలంకారం కాదని, నగర ప్రజలు వారి తరపున సమస్యలపై పోరాడేందుకు తనకు అప్పగించిన బాధ్యతని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని కమ్యూనిటీ హాలులో జరిగిన 13, 14, 29, 07 డివిజన్ల నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఈ 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోరుమిల్లి విజయశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగర ప్రజలను ఆదుకోవడం, అలాగే కార్యకర్తలకు సహాయంగా ఉండడం తమ కర్తవ్యమన్నారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ... వారి తరపున పోరాటం చేస్తామన్నారు. పార్టీ అధికారంలో లేనంత మాత్రాన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిత్యం తాను ప్రజా సేవకురాలినని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆంధ్రాలో కేసీఆర్‌ పాలన సాగుతోందని విమర్శించారు. 

అధికారం నాకు అలంకారం కాదు... మీరు నాకు ఇచ్చిన బాధ్యత


ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాలు కారణంగా త్వరలోనే తాగు... సాగునీటికి కొరత ఏర్పడే పరిస్థితి రానుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టబోతోందన్నారు. చంద్రబాబు అడగకుండానే అన్నీ ఇచ్చారని, అయితే జగన్‌ ప్రస్తుతం ప్రజా సంక్షేమం కోసం ఉన్న అన్ని సౌకర్యాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్ర్రతి కూల ప్రభుత్వం ఉన్నప్పటికీ నగర ప్రజలకు అన్ని సేవలందుతాయన్నారు. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమిష్టిగా పని చేస్తుందన్నారు. ఢీల్లి స్థాయిలో ఎన్టీఆర్‌... ప్రపంచ స్థాయిలో చంద్రబాబు ఆంధ్రులకు గుర్తింపు తీసుకువచ్చారని అనన్నారు. అయితే జగన్‌ ఆ గుర్తింపును కాలరాసే దిశగా పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ  రుణాలు,  పెన్షన్ల గురించి జగన్‌ మాట్లాడడం లేదన్నారు. అన్నీ పెంచడంలో భాగంగానే పెన్షన్లు మంజూరు చేసే వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, గృహ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారని దుయ్యబట్టారు. జగన్‌ తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ స్థాపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనదే మంచి విజయమన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజమహేంద్రవరం కంచుకోటని, ఇదే ఉత్సాహాన్ని త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో చూపించి మళ్లీ తెలుగుదేశం జెండాను ఎగురవేయాలన్నారు. మనకు బలమైన నాయకత్వం ఉందని, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోమన్నారు. జగన్‌ రాష్ట్రంలో అవగాహన రాహిత్యంతో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. నగర ప్రజలు తమ కుటుంబానికి ఎప్పుడూ ఆప్తులేనని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తమ ఇంటి తలుపులు 
ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. అనంతరం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ను స్థానిక మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పాలిక శ్రీను, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు  కప్పల వెలుగు, మజ్జి మద్మ, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, హబీబుల్లా ఖాన్‌, ఈతలపాటి కృష్ణ, మజ్జి శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, అప్పన్న, అట్టాడి రవి, అధిక సంఖ్యలో 7, 13, 14, 29 డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళా కర్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments