టీఆర్ఎస్ సభ్యత్వాలకు భారీ నమోదు

 

హైద్రాబాద్, జూలై 8  (globelmedianews.com):
టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇంఛార్జ్‌లు, పార్టీ సీనియర్‌ నాయకులతో కేటీఆర్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్‌ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్‌ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు, వృత్తి నిపుణులను కలిసి సభ్యత్వం ఇవ్వాలి. పట్టణాల్లోని రెసిడెంట్‌, కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్లను కలిసి పార్టీలో చేరేలా చూడాలి. 
 టీఆర్ఎస్ సభ్యత్వాలకు భారీ నమోదు

యువకులు, విద్యావంతులు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నందున ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు, ఆన్‌లైన్‌ ద్వారా చేరేలా చూడాలి. ఇందుకోసం ఆయా వర్గాలను స్వయంగా కలవాలి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నాయకుల సందేశాలు ఉపయోగించుకుని స్థానిక కేబుల్‌ టీవీలతో పాటు వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా మాద్యమాల్లో యువతను, కార్యకర్తలను సభ్యత్వ నమోదుకు కదిలించాలి. గ్రామాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ అనుబంధ సంఘాలు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలి. బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్ల వంటి కార్మిక క్షేత్రాల్లోకి నేరుగా వెళ్లాలి. ఇప్పటి వరకు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు మండలాలు, పట్టణాల వారీగా నమోదు వివరాలను అందించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌కు అందిస్తాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments:
Write comments