సెమీస్ కు చేరిన కివీస్, పాకిస్తాన్ ఔట్

 


లండన్, జూలై 6(globelmedianews.com)
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. సెమీస్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్‌పై నిన్నటి మ్యాచ్‌లో 300పైచిలుకు భారీ స్కోరుతో పాకిస్థాన్ గెలవాల్సి ఉండగా.. ఆ జట్టుకి అది సాధ్యం కాలేదు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. దీంతో.. ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ టీమ్‌ని 7 పరుగులకే ఆలౌట్ చేసింటే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కి చేరేది. కానీ.. 26 పరుగుల వరకూ కనీసం ఒక్క బంగ్లా వికెట్ కూడా పాక్ బౌలర్లు పడగొట్టలేకపోయారు. 

సెమీస్ కు చేరిన కివీస్, పాకిస్తాన్ ఔట్ 

దీంతో.. మ్యాచ్ ఫలితం తేలకుండానే పాకిస్థాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌లో రెండు జట్లకీ ఇదే ఆఖరి మ్యాచ్. ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు (14 పాయింట్లు), భారత్ (13), ఇంగ్లాండ్ (12) జట్లు సెమీస్‌కి అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్తు కోసం న్యూజిలాండ్ టీమ్ (11), పాకిస్థాన్ (9) రేసులో నిలిచాయి. కానీ.. పాక్ పేలవ ప్రదర్శనతో ఆ బెర్తుని కివీస్ ఖాయం చేసుకుంది.  ఒకవేళ బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలిచి.. ఆ జట్టు 11 పాయింట్లతో న్యూజిలాండ్ సరసన నిలిచింది. కానీ.. నెట్‌ రన్‌రేట్‌లో న్యూజిలాండ్ (+0.175) కంటే పాకిస్థాన్ (-0.792) చాలా వెనకబడి ఉంది. దీంతో.. బంగ్లాదేశ్‌ని 300పైచిలుకు భారీ స్కోరు తేడాతో ఓడించాల్సి ఉండేది. మ్యాచ్‌కి ముందు 500 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ని 50కే ఆలౌట్ చేస్తామని బీరాలు పలికిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. మ్యాచ్‌లో 3 పరుగులకే పరిమితమయ్యాడు. అనితర సాధ్యమైన విజయం సాధిస్తేనే.. సెమీస్ రేసులో నిలిచే స్థితిలో చివరి మ్యాచ్ ఆడిన పాకిస్థాన్ గెలువనైతే గెలిచింది కానీ.. భారీ తేడాతో కాదు. దీంతో ఆఖరి మ్యాచ్ విజయంతో 11 పాయింట్లు ఖాతాలో వేసుకున్నా.. రన్‌రేట్ తక్కువగా ఉండటంతో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ (100; 7 ఫోర్లు) సెంచరీ చేయగా.. బాబర్ ఆజమ్ (96; 11 ఫోర్లు) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. ముస్తఫిజుర్ (5/75) టోర్నీలో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం యువ పేసర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌షాహీన్ షా అఫ్రిది (6/35) విజృంభించడంతో బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. మెగాటోర్నీలో షకీబ్ అల్ హసన్ (64; 6 ఫోర్లు) ఏడో అర్ధ సెంచరీతో అదరగొట్టినా మిగిలినవారు విఫలమవడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ముందే చెప్పిన షోయబ్ మాలిక్‌కు ఆ జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్‌తో వీడ్కోలు పలికింది.

No comments:
Write comments