టీపీసీసీ రేసులో రేవంత్

 


హైద్రాబాద్, జూలై 6(globelmedianews.com
ముందస్తు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం ముందడుగు వేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  చీఫ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది.

టీపీసీసీ రేసులో రేవంత్

ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంతియా కూడా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు జోరుగా వినిపించాయి. అయితే, రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను ధాటిగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.2015 నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అని, ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

No comments:
Write comments