మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

 

18వ తేదీన ఎన్నికల సిబ్బందికి మొదటి విడత ఎన్నికల శిక్షణ తరగతులు
అధికారులు సంసిద్ధంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్
నాగర్ కర్నూలు, జూలై 15 (globelmedianews.com): 
త్వరలో జిల్లాలోని మూడు నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికలను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇ.శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో   మున్సిపల్ ఎన్నికల నోడల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తయినట్లు ఆయన తెలిపారు. 
మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జిల్లాలో మొత్తం 130 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాగర్ కర్నూలులో 49, కల్వకుర్తి లో 44, కొల్లాపూర్ లో 39,  పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అయన చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు మూడు బ్యాలెట్ బాక్సుల చొప్పున పంపిణీ చేస్తామని, తెలిపారు. మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు రెండు విడతలుగా ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించాలని, మొదటి విడత ఈనెల 18వ తేదీన నాగర్ కర్నూల్ సాయి గార్డెన్ నందు ప్రిసైడింగ్ అధికారులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఇతర ఎన్నికల సిబ్బందికి ఉదయం 10:00 గంటల నుండి ఒంటిగంట వరకు 375 మంది సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు 375 మందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు మల్లికార్జున ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల సిబ్బంది 750 ఎంపిక మొదటి విడత ర్యాండామేజేషన్ ఈరోజే నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్లు స్వీకరించుటకు తగిన గదులను, సీటింగ్ ఏర్పాట్లను, బార్కేడ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు.మున్సిపల్ ఎన్నికలకు కావలసిన వాహనాలను సమకూర్చాలని ఆర్టీవో ను ఆదేశించారు.నాగర్ కర్నూల్ కల్వకుర్తి మరియు కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశువర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజప్ప, నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ చింత వేణు, కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఆర్టీవో ఎర్రిస్వామి, ఏసీ రాజ శేఖర రావు, వెంకటేశ్వర శెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:
Write comments