ఉన్నత విద్యాశాఖలో విభజనకు లైన్ క్లియర్

 


హైద్రాబాద్, జూలై 4 (globelmedianews.com)
తెలంగాణ ఉన్నత విద్యామండలి విభజనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై గవర్నర్‌ నరసింహన్‌తో అధికారులు చర్చించారు. గవర్నర్‌ సూచనల మేరకు విభజన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు... విభజన అంశాలకు సంబంధించి జరిపిన సమావేశాల్లో సానుకూలత వ్యక్తమైంది. దీంతో ఉన్నత విద్యామండలి విభజనకు లైన్‌క్లియర్‌ అయ్యింది. ఉన్నత విద్యామండలిని విభజించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు సమాయాత్తం అవుతున్నారు.తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులతో గవర్నర్‌ నరసింహన్‌ ఇప్పటికే భేటీ అయ్యారు. 

న్నత విద్యాశాఖలో విభజనకు లైన్ క్లియర్

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విభజనకు సంబంధించి చర్చించారు. త్వరలోనే ఏపీ ఉన్నతవిద్యామండలి అధికారులతోనూ ఆయన భేటీ కాబోతున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయం 2014 జూన్‌ 1 నాటికి ఉన్నత విద్యామండలి ఖాతాలో 134 కోట్ల 29 లక్షలు ఉన్నాయి.మండలి ఏర్పాటైన సమయంలో మొత్తం 34 పోస్టులు మంజూరుకాగా.. వాటిల్లో ప్రస్తుతం 23 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లో 14 మంది తెలంగాణ స్థానికత కలిగి ఉండగా... మిగిలిన 9మంది ఏపీ స్థానికత కలిగిన వారు. అన్ని అంశాల్లోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58:42 పద్దతిలో విభజన జరగాల్సి ఉంది. కాబట్టి ఈ లెక్కల ప్రకారం విభజించేందుకు  ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. మొత్తంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి విభజన సమస్యలపై సానుకూల చర్చలు జరపడంతో..... విభజన జరగని శాఖల్లో స్పీడ్‌ పెరిగింది. ఇందులో భాగంగానే ఉన్నత విద్యామండలి కూడా విభజనకు సిద్దమైంది. రాష్ట్ర ఏర్పడిన ఐదేళ్లకు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌  అధికారులు విభజనకు సమాయాత్తం అవుతున్నారు.

No comments:
Write comments