తల్లీకూతుర్ల ఆత్మహత్యాయత్నం..కూతురి మృతి

 

నిజామాబాద్ జూలై 2(globelmedianews.com) 
జిల్లాలోని వేల్పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల కూతురితో పాటు తనకు కూడా నిప్పంటించుకుని ఒక తల్లి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, 60 శాతం కాలిన గాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పూర్ మండలం పడగల్కు చెందిన మౌనికకు మూడేళ్ల కిందట నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో వివాహం జరిగింది. 
తల్లీకూతుర్ల ఆత్మహత్యాయత్నం..కూతురి మృతి


అయితే మౌనిక ఉన్నట్టుండి మంగళవారం కూతురితో పాటు నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు మౌనికను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మాత్రం మృతి చెందారు. మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

No comments:
Write comments