డైలీ సీరియల్ గా కర్నాటకం

 

బెంగళూర్, జూలై 26, (globelmedianews.com)
కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నది. కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలి రెండు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది. నాలుగోసారి సీఎం పీఠం ఎక్కాలన్న యడ్యూరప్ప ఆశ నిరాశ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన వయసుతోపాటు పలు కారణాల రీత్యా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతల ఆశీర్వాదం కోరుతున్నారు. ఇక స్పీకర్ రమేశ్ కుమార్  ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మిగతా 14 మందికి సంబంధించి తర్వలో నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమని ఆపద్ధర్మ సీఎం కుమారస్వామి వెల్లడించారు. 
 డైలీ సీరియల్ గా కర్నాటకం

మరోవైపు ఈనెల 31లోగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించకపోతే ఆగస్టు నుంచి జీతాలు అందకపోవచ్చని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం విశ్వాస పరీక్షలో ఓడి పతనమైన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది. ఒకసారి సర్కార్ ఏర్పాటు చేసి భంగపడిన నేపథ్యంలో ఆ పార్టీ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నది. నాలుగోసారి సీఎం అయ్యేందుకు ఉవిళ్లూరుతున్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోవడం దీనికి కారణంగా కనిపిస్తున్నది. 75 ఏండ్లకు పైబడిన నేతలు చట్టబద్ధ పదవులు చేపట్టకూడదని బీజేపీ గతంలో నిర్ణయించింది. ఈ కారణంతోనే బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, సుమిత్రామహాజన్ వంటి నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచింది.76 ఏండ్ల యడ్యూరప్పకు ఆయన వయసే అడ్డంకిగా మారినట్లు కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం మనుగడపై గవర్నర్ వాజుభాయ్ వాలా కేంద్రానికి ఇచ్చిన నివేదిక, రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం, యడ్యూరప్పపై అవినీతి కేసులు, ఇతర కారణాల రీత్యా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పార్లమెంటరీ బోర్టు నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తున్నది. సీఎంగా మరొకరిని తెరపైకి తెచ్చే యోచనలో మోదీ, షా ఉన్నట్లు కనిపిస్తున్నది. బుధవారం జరుగాల్సిన బీజేఎల్పీ సమావేశం వాయిదా పడటంతో ప్రమాదాన్ని పసిగట్టిన యడ్యూరప్ప, ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతల ఆశీసులు కోరే ప్రయత్నంలో ఉన్నారు. 

No comments:
Write comments