తెరపైకి పసుపు బోర్డుతో...బీజేపీకి చెక్

 

నిజామాబాద్, జూలై 31, (globelmedianews.com)
తెలంగాణలో బలోపేతం కావాలిన బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనిపించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికి రకరకాల ప్లాన్లు వేస్తోంది. అయితే, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందుకు తగ్గట్టు కౌంటర్లు రెడీ చేస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది నిజామాబాద్‌లో పసుపుబోర్డు. నిజామాబాద్‌లో బీజేపీ గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. 
తెరపైకి పసుపు బోర్డుతో...బీజేపీకి చెక్

దీంతో జనం కూడా బీజేపీని నమ్మారు. సీఎం కుమార్తె కవితను కాదని, ధర్మపురి అరవింద్‌కు ఓటేసి విజయాన్ని కట్టబెట్టారు. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి 50 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇంతవరకు పసుపు బోర్డు మాటెక్కడా వినిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో చాలా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ, పసుపుబోర్డుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది బీజేపీ ప్లాన్. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు గెలిచిన చోట్ల పట్టణ ప్రాంతాల్లోని విజయబావుటా ఎగరేయాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఏ నిజామాబాద్‌లో అయితే బీజేపీ ఘనవిజయం సాధించిందో.. అదే చోట మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరేసి కారు జోరు తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తోంది. ఆ రకంగా బీజేపీ గెలుపు కేవలం గాలివాటం మాత్రమేనని, టీఆర్ఎస్ సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

No comments:
Write comments