కేసీఆర్ రాజకీయాలకు ఇచ్చిన విలువ ప్రజలకు ఇవ్వడం లేదు

 

కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించే పిట్ట: కొల్లి మాధవి
హైదరాబాద్ జూలై 12 ,(globelmedianews.com):
కేసీఆర్ రాజకీయాలకు ఇచ్చిన విలువ ప్రజలకు ఇవ్వడం లేదని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొల్లి మాధవి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే మునిసిపల్ చట్టం తెస్తున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించే పిట్ట అని, అదే గవర్నెన్స్ అనుకుంటారని విమర్శించారు. సెప్టెంబర్ 6 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి పాలనా జరగలేదన్నారు. 
కేసీఆర్ రాజకీయాలకు ఇచ్చిన విలువ ప్రజలకు ఇవ్వడం లేదు

9 నెలల పాపపై అఘాయిత్యం జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు బీజేపీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటుందన్నారు. రేపు జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖలు వైఫల్యం చెందాయని మాధవి విమర్శించారు. మున్సిపాలిటీలకు 100రోజుల ప్రణాళికలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014కు సంబంధించిన సమగ్ర సర్వేను బయట పెట్టాలని కోరారు. మార్పు రావాల్సింది చట్టాలలో కాదని.. కేసీఆర్ మనస్తత్వంలో రావాలన్నారు. వార్డుల విభజన శాస్త్రీయత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అది కేసీఆర్ పిరికితనాన్ని సూచిస్తోందని మాధవి విమర్శించారు.

No comments:
Write comments