పోలవరం పనులకు వరుణుడు అడ్డంకి

 

ఏలూరు, జూలై 17, (globelmedianews.com)
కుండపోత వర్షానికి పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు ఆగాయి. నాటి భారీ వర్షంతో అధికారులు పనులకు విరామం ఇచ్చారు. ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. నిత్యం భారీ యంత్రాల రణగొణ ధ్వనులతో ఉండే వాతావరణం మూగబోయింది. ప్రతికూల వాతావరణంలోనూ ప్రాజెక్టు పనుల్ని నవయుగ కంపెనీ ఎన్నడూ ఆపింది లేదు. వర్షా కాలం కూడా, ఇలాగే పనులు కొనసాగించవచ్చు అని ఆశించారు. అయితే, ఇంత వరద ఇప్పుడే వస్తుంది అని ఊహించలేదు. సగటున ప్రతీ రోజు 9 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల్ని చేస్తూ రాసాగారు. మరో వైపున ఇక్కడ గోదావరి నీటి మట్టమూ పెరుగుతోంది. భద్రాచలంలో వరద గోదారి 30 అడుగులకు చేరుకుంది. వాతావరణ శాఖ సైతం ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. 
పోలవరం పనులకు వరుణుడు అడ్డంకి

భారీ వానలు ఇలానే కొనసాగితే గోదారి తన ఉగ్ర రూపాన్ని చూపే వీలుంది. వరద ఎప్పుడు తగ్గితే అప్పుడు, వెంటనే పనులు మొదలు పెడతారు.ముందస్తు జాగ్రత్తగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి వరద నీటిని గోదాట్లోకి వదులుతున్నారు. బేసిన్‌ను ఖాళీ చేసేందుకు చూస్తున్నారు. ఆదివారం 3 లక్షల, 23 వేల 739 క్యూసెక్కుల్ని సముద్రంలోకి వదిలారు. 3 లక్షల, 28 వేల, 813 క్యూసెక్కులు బ్యారేజీకి వరద ఇన్‌ ఫ్లోగా ఉంది. పశ్చిమలో ఉదయం నుండీ భారీగా వర్షం పడింది. మరో వైపున సముద్రపు రాకాలి అలలూ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీర్‌ ప్రాంత వాసులైతే అరచేత ప్రాణాల్ని పెట్టుకుంటున్నారు. ఏజెన్సీలోనూ కొండ కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. జల్లేరు, బైనేరు వాగులు రహదారులపై నుండి ప్రవహిస్తున్నాయి. పోలవరంలోని కొత్తూరు చెరువూ నిండు కుండలా ఉంది. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు చెరువు గేట్లను ఎత్తారు.ఏజెన్సీ, మెట్టలోని తమ్మిలేరు, ఎర్రకాల్వ, కొవ్వాడ, పోగొండ, జల్లేరు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడటం తో వానలు జోరందుకున్నాయి. డెల్టాలో ఖరీఫ్‌ సాగు కష్టాలు వర్ణనా తీతంగా ఉంది. ఆక్వా రైతుల పుట్టునూ ముంచాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గోదారితో ఆ ప్రాంతం కనువిందు చేస్తోంది. పాపిడొండలవద్ద నిండు కుండలా మారింది. గోదారి ప్రవాహం ఇక్క డ ఉధృతంగా ఉంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోనూ వరద గోదా రిని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. జోరు వానలు, ఈదురు గాలుల మందస్తు హెచ్చరికల నేపథ్యాన ఆగిన పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లి ఎప్పుడు ఆరంభమౌతాయన్నది తెలియకుంది.

No comments:
Write comments