జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద వృద్ధురాలి ఆత్మహత్యా యత్నం

 

గుంటూరు జూలై 25 (globelmedianews.com)
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఉదయం అలజడి రేగింది. ఓ వృద్ధురాలు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం సృష్టించింది. గన్నవరానికి చెందిన సత్యనాగకుమారి అనే అనే వృద్ధురాలు క్యాంపు కార్యాలయానికి వచ్చింది. 
జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద వృద్ధురాలి ఆత్మహత్యా యత్నం

అందరూ చూస్తుండగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో తుళ్లిపడిన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈనెల 19వ తేదీన తన సమస్యలపై నాగసుందరి ‘స్పందన’ కార్యక్రమంలో అర్జీ ఇచ్చింది. అధికారుల నుంచి సకాలంలో స్పందన రాకపోవడంతో ఆమె ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం

No comments:
Write comments