బీమా మిత్ర అందోళన

 


తాడేపల్లి, జూలై 2, (globelmedianews.com)
తాడేపల్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు మంగళవారం ఉదయం  బీమా మిత్ర ఉద్యోగుల నిరసనకు దిగారు.  ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి వర్కర్లు పాల్గోన్నారు. 2007 సంవత్సరం నుంచి బీమా మిత్రులుగా కొనసాగుతున్నాం. ఇప్పటివరకు వరకు మాకు ఎటువంటి జీతభత్యాలు లేవు.. 

 బీమా మిత్ర అందోళన

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా పథకాలు ప్రవేశపెట్టి వేల కుటుంబాలలో వెలుగులు నింపారు. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న దాఖలు లేవని వారన్నారు. ప్రభుత్వం మారినా బీమా మిత్రులుగానే పనిచేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సిఎం జగన్ స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని  నిరసనకారులు తెలిపారు.

No comments:
Write comments