షాద్ నగర్ లో కాషాయ జెండా ఎగురవేస్తాం

 

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మా రావు
షాద్ నగర్, జూలై 18 (globelmedianews.com
షాద్ నగర్ పట్టణం లోని వివేకానంద కళాశాల లో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు విస్తారక్ ల కార్యశాల అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్ గౌడ్  అద్వర్యం లో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సభ్యత్వ ప్రముక్ ,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు  ధర్మా రావు హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర పార్టీ కి షాద్ నగర్ నుండి 25 వేల సభ్యత్వాలు చేసి రాష్ట్ర పార్టీ కి అందించాలని కోరారు.అప్పుడు మనం షాద్ నగర్ లో కాషాయ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు . షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు భాజపా కు అనుకూలంగానే ఉన్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికలే ఉదాహారణ అని పేర్కొన్నారు . పార్లమెంట్ ఎన్నికలో మనకు  తెలంగాణ లోఇరవై శాతం ఓట్లు వచ్చాయి అని పేర్కొన్నారు .
షాద్ నగర్ లో కాషాయ జెండా ఎగురవేస్తాం

రాబోయే రోజుల్లో మరో ఇరవై శాతం ఓట్ల కు కష్ట పడితే తెలంగాణ లో అధికారం లోకి మనమే వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు .రాబోయే రోజుల్లో  తెలంగాణ ,బెంగాల్ ,కేరళ లో అధికారం లో ఉంటామని  అమిత్ షా  చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు .తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ షాద్ నగర్ లో భాజపా జెండా ఎగురవేయాలంటే రాష్ట్ర పార్టీ ఇచ్చిన టార్గెట్ ను మనము త్వరలో పూర్తి చేయాలన్నారు. ప్రజలందరు భాజపా వైపు చూస్తున్నారు కాబట్టి భాజపా సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ముందుకు స్వచ్చందంగా వస్తున్నారని పేర్కొన్నారు .భాజపా ను చూస్తే తెరాస నాయకులకు ,ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని అన్నారు అదేవిదంగా తెరాస పాలన లో జరిగిన అవినీతిని ప్రతి కార్యకర్త బయటపెట్టా లని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాతపల్లి కృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెంది మహేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కమ్మరి భూపాల చారి,జిల్లా కార్యదర్శి అండాపురం నర్సింహ గౌడ్ ,సీనియర్ నాయకులు నందిగామ వెంకటేష్ ,సీనియర్  నాయకులు కొప్పుల రవీందర్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి కక్కునూరి వెంకటేష్ గుప్త భాజపా యువ నాయకులు పల్లె ఆనంద్ , మోతే శ్రీనివాస్,వివిద మండలాల అద్యక్షులు,మల్చాలం మురళి,చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి,ఇస్నాతి శ్రీనివాస్ ,భవాండ్ల మాణిక్యం,బంటారంకారుకొండ  లక్ష్మణ్ గౌడ్,  వంశీకృష్ణ, ఆకుల ప్రదీప్ ,క్యామ మహేష్ ,సొప్పరి నర్సింహ్మ, శివా రెడ్డి,   వివిధ మండలాల సభ్యత్వ ప్రముక్ లు పాల్గొన్నారు. 

No comments:
Write comments