బావిలో కారు…తప్పిన ప్రాణహాని

 

జగిత్యాల జూలై 20 (globelmedianews.com)
పూర్వ ఆదిలాబాద్ జిల్లా కడెం మండలానికి వెళ్లి వస్తున్న ఓ కారు అదుపుతప్పి పొలం బావిలో  పడిపోయిన ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో  చోటు చేసుకుంది. వివరాల్లోకి  వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నలుగురు డాక్టర్లు సంతోష్, రాజేందర్, శ్యామ్, విజయ్ లు 
బావిలో కారు…తప్పిన ప్రాణహాని

సిరిసిల్ల నుండి తమ వ్యక్తిగత పనుల మీద   పూర్వ ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం కు వెళ్లి వస్తుండగా  సారంగాపూర్ శివారులోని సెల్ టవర్ సమీపంలో అదుపుతప్పిన వారి కారు రోడ్డు పక్కన వున్న వ్యవసాయబావిలో పడింది. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణహాని  జరగలేదు. ఒకరు స్వల్ప గాయాలతో బయట పడగ, మరో ముగ్గురికి  కాళ్ళు, చేతులు విరిగాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రాజయ్య సంఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు క్షతగాత్రులను  గ్రామస్థుల సహాయం తో మంచం  ద్వారా తాడుతో బయటకు తీయుంచి ఆసుపత్రికి తరలించారు. 

No comments:
Write comments