అమంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

 


రంగారెడ్డి జూలై 8 (globelmedianews.com):
రంగారెడ్డి జిల్లా అమంగల్ పట్టణ సమీపంలోని కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారి మెడిగడ్డ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలోఐదుగురు మృతి చెందారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టెవాడ పి ఎస్ లో  హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దుర్గ ప్రసాద్ కుటుంబం తో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకొని వస్తున్నారు. 

అమంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి

ఆదే సమయంలో మెడిగడ్డ  గ్రామ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్  కి కాంట కోసం ఒక లారీ టర్న్ అయింది.  హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇనోవా కారు ఢీ కొట్టింది. ఇనోవా లో ఉన్న దుర్గ ప్రసాద్, భార్య విజయ లక్ష్మి, కొడుకు శాంతన్, దుర్గ ప్రసాద్ బావ రాజు, అక్క అక్కడికక్కడే మృతి చెందారు.. డ్రైవర్ ఖలీల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఖలీల్ ను  హైదరాబాద్ కు అంబులెన్స్ లో పంపించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

No comments:
Write comments