ఎల్లారెడ్డిపేట వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య సస్పెండ్ .

 

ఆదేశాలు జారీచేసిన  జిల్లా కలెక్టర్ 
సిరిసిల్ల, జులై 12 (globelmedianews.com)
గత ఆరు నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ,  పశువులకు సక్రమంగా  వైద్య సేవలు అందించడంలో విఫలమైన ఏల్లారెడ్డిపేట   వెట ర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్యను జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ శుక్రవారం సస్పెండ్ చేసారు.గొల్లపల్లి లో  వెట ర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య   ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల లో డిప్యూ టేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు . గత ఆరు మాసాలుగా విధులను సక్రమంగా నిర్వర్తించక పోవడం ,ఏల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల ను సమయం ప్రకారం తెరవ క పోవడం వల్ల రైతులు సేవలు అందడం లేదంటూ ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు చేసారు. 
ఎల్లారెడ్డిపేట  వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య సస్పెండ్ .

ఇది ఇలా ఉండగా శుక్రవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల  సకాలంలో తెరవడం లేదన్న విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది. స్పందించిన కలెక్టర్ స్వయంగా ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డి పేట  పశు వైద్యశాల వెళ్లారు . అప్పటికల్లా కార్యాలయం తెరుచుకోలేదు . 40 నిమిషాలకు పైగా అక్కడే ఉండి  అధికారుల కోసం వేసి చూసారు. ఫోన్ లో వారిని సంప్రదించారు . క్షేత్రస్థాయి విధినిర్వహణలో ఉన్నామని ఉద్యోగులు తెలుపగా వాట్సప్ ద్వారా లోకేషన్ పంపించాల్సిందిగా హుకుం జారీ చేసారు.  అరగంట సేపు వేచి చూసిన వారు వాట్సప్ ద్వారా లోకే షన్  కలెక్టర్ కు పంపలేదు.  ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడారు. పశు వైద్యశాల  వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు . పశువులు అనారోగ్యంతో మరణించినా పట్టించుకున్న వారే లేరన్నారు . దాదాపు 45 నిమిషాల అనంతరం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి  వెంకట రమణ కార్యాలయం వద్దకు వచ్చారు.  వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి  జె . కొమురయ్య పని తీరు బాగా లేదని పలు మార్లు హెచ్చరించిన మార్పురావడం లేదని చెప్పారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, ఈ విషయం ను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అన్నారు.  విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వెట ర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లోని పశు సంవర్ధక శాఖ అధికారులు తమ పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

No comments:
Write comments