కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతి

 

నిజామాబాద్, జూలై 24, (globelmedianews.com)
నగరంలోని మాలపల్లి ముజాహిద్ నగర్ ప్రాంతానికి చెందిన 10 సంవత్సరాల సయ్యద్ రియాజ్ మరియు ఐదు సంవత్సరాల మహమ్మద్ బద్రుద్దీన్ ఇరువురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో కనపడకుండా పోయారు. దీంతో కుటుంబీకులు కాలనీవాసులు చుట్టుపక్కల వెతుకగా కనిపించక పోయారు. అయితే సాయంత్రం సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అనంతరం పిల్లలను వెతకడం ప్రారంభించారు. 
కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతి

అయితే అదే కాలనీలో పార్క్ చేసిన ఓ కారులో చిన్నారులు ఆడుకుంటుండగా అనుకోకుండా డోర్స్ లాక్ కావడం జరిగి ఉంటుందని పోలీసులు స్థానికులు భావిస్తున్నారు. అయితే కారు యజమాని బయటకు వెళ్దామని కారు తీసేసరికి ఇరువురు చిన్నారులు మృతి చెందే ఉండడంతో  పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే కార్ డోర్ లాక్ కావడంతో శ్వాస  ఆడకపోవడంతోని మృతి చెంది ఉంటారని పోలీసులు వైద్యులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఊపిరి ఆడక మృతి చెంది సమయంలో వాంతులు సైతం కావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.  చిన్నారుల మృతితో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. 

No comments:
Write comments