ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

 

మెదక్ జూలై 15 (globelmedianews.com)
తెలంగాణ ఫైర్బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న జగ్గారెడ్డి ఇందుకోసం అవసరమైతే దీక్ష చేస్తానని ప్రకటించారు. 
ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

చెప్పినట్టే ఈ రోజు నుంచి జల దీక్ష చేపట్టనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇందులో భాగంగా ఈరోజు దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

No comments:
Write comments